మరో ఒకటి రెండు రోజుల్లో వీకెండ్ ఉందంటే చాలు… పిల్లల నుంచి పెద్దల వరకు ఏమేం చేయాలా అని ప్లాన్ రెడీ చేసుకుంటారు. అందులో ఆటల నుంచి సినిమాల వరకు అన్నీ ఉంటాయి. ఇక డ్యాన్స్, డ్రింక్స్ చేస్తే ఎంత కిక్ వస్తుందో.. ఓ మంచి సినిమా చూసినా సరే అంతే కిక్ ఎక్కుతుంది. ఓ రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి వాళ్ల కోసమే.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వారం పలు సినిమాలని విడుదలకు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా, మిగిలినవి మరికొన్ని గంటల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన చాలా మార్పులు జరిగాయి. అందులో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒకటైతే.. సినిమాలు ఓటీటీలో చూడటం బాగా అలవాటైపోయింది. దీంతో ప్రతివారం కూడా మినిమం పదుల సంఖ్యలో సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో తెలుగు సినిమాల దగ్గర నుంచి హాలీవుడ్ వెబ్ సిరీసుల వరకు అన్నీ ఉంటున్నాయి. అలానే కామెడీ జానర్ నుంచి థ్రిల్లర్ జానర్ వరకు ఉండనే ఉంటున్నాయి. దీంతో ఎవరికి నచ్చిన సినిమాలు లేదా వెబ్ సిరీస్.. వాళ్లకు నచ్చిన టైంలో చూసేస్తున్నారు. అలా రేపు కూడా ఏకంగా 13 సినిమాలు.. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయాయి. ఇంతకీ వాటి లిస్ట్ ఏంటి? ఏయే వాటిలో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.