సినిమాల ట్రెండ్ బాగా మారిపోయింది. ఎందుకంటే ఎంత త్వరగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారో.. అంతే త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. అలాంటిది ఓ సినిమా నెలల పాటు.. ఓటీటీల్లో రాకుండా ఆపారంటే దాని వెనక పెద్ద రీజనే ఉంటుంది. అదే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ. రీజన్స్ ఏంటనేది పక్కనబెడితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతిదీ కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ టైంలో ఇన్నాళ్లపాటు ఆగడం నెటిజన్లకు పలు సందేహాలు రేకెత్తించింది. కానీ ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ని అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’.. ఈ ఏడాది ఆగస్టు 12న విడుదలైంది. ఫుల్ మాస్ మసాలాగా తీసిన ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా నటించారు. రిలీజ్ కి ముందు ఇందులో ‘రాను రాను’ సాంగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ.. సినిమా మాత్రం తేలిపోయింది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం అక్టోబరు తొలివారంలోనే అమెజాన్ ప్రైమ్ లో మాచర్ల నియోజకవర్గం మూవీ రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తేదీలకు సంబంధించిన పలు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు.
కానీ రూ.30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్ల లోపే వసూళ్లు సాధించింది. డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఓటీటీ సంస్థలు ఏవి కూడా.. ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించలేదని, తక్కువ రేటుకు అడిగాయని తెలుస్తోంది. ఈ కారణంగానే ఓటీటీలకు తక్కువ ధరకే ఈ మూవీ ఇచ్చేందుకు చిత్ర నిర్మాత ఇష్టపడలేదని ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజం ఏంటనేది పక్కనబెడితే.. ఇప్పుడు మాత్రం డిసెంబరు 9 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అంటే దాదాపు నాలుగు నెలల తర్వాత రిలీజ్ చేస్తున్నారనమాట. ఇన్ని రోజులు ఓటీటీ రిలీజ్ కాకుండా ఆపడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Audience, samavesam avvandi, ee niyojakavargam lo chala jarugutundi!
Chusedham #MacherlaNiyojakavargamOnZee5 lo!
Coming on Dec 9#MarcherlaMassLoading #MacherlaNiyojakaVargam @actor_nithiin @IamKrithiShetty #MsRajashekarReddy @SreshthMovies @vennelakishore @thondankani pic.twitter.com/K6NCE2bghP
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 25, 2022