ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కు వెళ్లాలి. అలా మాత్రమే ఎక్స్ పీరియెన్స్ చేయగలం అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అయితే థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. అదే టైంలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రపంచ సినిమాని ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అలవాటైన ఓటీటీలు అంటే రెండు మూడు పేర్లు చెబుతారు. కానీ నెట్ ఫ్లిక్స్ అని మాత్రం చెప్పరు. ఎందుకంటే అది చాలా కాస్ట్ లీ, అలానే తెలుగు సినిమాలు పెద్దగా ఉండవని మాట్లాడుకుంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు రూటు పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ ప్రస్తుతం తీస్తున్న పలు భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో ఫ్యాన్స్ కూడా అలర్ట్ అయిపోతున్నారు. ఓటీటీ పార్ట్ నర్ ముందే ఫిక్సయిపోవడంతో.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలి అనేది నెలల ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు.
ఇక నెట్ ఫ్లిక్స్ ప్రకటించిన దాని ప్రకారం చిరు ‘భోళా శంకర్’, రవితేజ ‘ధమాకా’, మహేశ్-త్రివిక్రమ్ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది. ఇప్పుడు వీటి హక్కుల్ని కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్.. రోజురోజుకి పడిపోతున్న తమ సంస్థని పైకి లేపాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీస్ తో పాటు నాని ‘దసరా’, ‘డీజే టిల్లు’ సీక్వెల్, అనుష్క-నవీన్ పోలిశెట్టి మూవీ, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ, వరుణ్ తేజ్ మూవీ, 18 పేజెస్, కార్తికేయ కొత్త మూవీ, నాగశౌర్య న్యూ మూవీ, సందీప్ కిషన్ ‘బడ్డీ’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, బుట్టబొమ్మ, కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాలున్నాయి. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.