మంచు విష్ణు హీరోగా.. పాయల్ రాజ్‌పుత్, బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం జిన్నా. టైటిల్ ప్రకటన రోజు నుంచే ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. ఇక మూవీలో ఇద్దరు బోల్డ్ బ్యూటీస్ ఉండటంతో.. సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. పైగా మంచు విష్ణుకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. దాంతో తన ఆశలన్ని.. ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. సినిమా కచ్చితంగా భారీ హిట్ కొట్టి తీరుతుందని భావించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. ఊహించని విధంగా ప్లాఫ్ అయ్యింది. విష్ణు కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది జిన్నా మూవీ. ఇక తాజాగా జిన్నా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ వివరాలు..
ఇక జిన్నా సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్రం బృందం మాత్రం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదు. దీంతో జిన్నా మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు. తాజాగా జిన్నా మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో రెడీ అయ్యింది. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఈ సినిమాను డిసెంబర్ 2 శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించగా.. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. ఇక బిగ్‌స్క్రీన్ మీద నిరాశపరిచిన ‘జిన్నా’ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.