ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆడియెన్స్ అటెన్షన్ సంపాదించుకున్న సినిమాలలో లవ్ టుడే ఒకటి. తమిళ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా.. నవంబర్ 25న తెలుగులో విడుదలై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రెండు వారాల ముందుగానే తమిళంలో విడుదలైన లవ్ టుడే.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ లవ్ టుడే మూవీని తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేయగా.. రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి మంచి లాభాలను అందించినట్లు తెలుస్తోంది.
ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన లవ్ టుడే మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకునేసరికి.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా యూనిక్ సబ్జెక్టుతో తెరమీదకు వచ్చిన లవ్ టుడే మూవీ.. తెలుగు రాష్ట్రాలలో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కొద్దిరోజుల క్రితమే తమిళ వెర్షన్ ఓటిటి రిలీజ్ అవ్వడంతో.. తెలుగు వెర్షన్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు.
లవ్ టుడే తెలుగు వెర్షన్ కి కూడా నెట్ ఫ్లిక్స్ భారీ అమౌంట్ చెల్లించి హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ని స్ట్రీమింగ్ మొదలు పెట్టేసింది నెట్ ఫ్లిక్స్. డిసెంబర్ 23న అంటే శుక్రవారం రాత్రి నుండే స్ట్రీమింగ్ మొదలైంది. సో.. ఇన్నిరోజులు వెయిట్ చేసిన ఫ్యాన్స్ అంతా సినిమా ఓటిటి రిలీజ్ అవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా హీరోయిన్ గా నటించింది. యువన్ శంకర్ రాజా సినిమాకి సంగీతం అందించాడు. మరి ఆల్రెడీ సూపర్ హిట్ అయిన లవ్ టుడే మూవీకి డిజిటల్ లో ఎలాంటి ఆదరణ లభించనుందో చూడాలి.
̶P̶r̶e̶m̶a̶ ̶k̶o̶s̶a̶m̶a̶i̶ Phone-u valane valalo padine paapam pasivaadu. Love Today, now streaming in Telugu on Netflix.#LoveTodayOnNetflix pic.twitter.com/yjoGCXFxaa
— Netflix India South (@Netflix_INSouth) December 23, 2022