తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చాలే భాష, హీరో ఎవరు అనే విషయాలు అస్సలు పట్టించుకోరు. పలువురు తమిళ, మలయాళ, కన్నడ హీరోలకు మన రాష్ట్రాల్లో చాలామంది ఫ్యాన్స్ ఉండటానికి ఇదే కారణం. ఇక ఈ లిస్టులో చాలామంది ఉన్నప్పటికీ విశాల్ కి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. స్వతహాగా తెలుగువాడైన విశాల్.. తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పందెం కోడి’తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన విశాల్.. అప్పటి నుంచి తన ప్రతి సినిమా టాలీవుడ్ లోనూ రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు.
ఇక విషయానికొస్తే.. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసి విశాల్ ఎక్కువగా మాస్ కథల్ని ఎంచుకుంటూ ఉంటాడు. దాదాపు అలాంటి మూవీసే చేస్తుంటాడు. గతేడాది చివర్లో ‘లాఠీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా.. యాక్షన్ ఇష్టపడేవారిని మాత్రమే ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోయారు. అందులో భాగంగానే విడుదల తేదీని ట్విట్టర్ లో ప్రకటించారు. సన్ నెక్స్ట్ లో జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు.
మురళీకృష్ణ అనే కానిస్టేబుల్, ఓ కేసు విషయంలో సస్పెండ్ అవుతాడు. మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. గతంలో తాను చేసిన ఓ మంచిపని కారణంగా అధికారి ఒకరు సాయం చేస్తారు. దీంతో మురళీకృష్ణ ఉద్యోగంలో తిరిగి జాయిన్ అవుతాడు. అయితే మురళీ లైఫ్ లోకి దాదా శూర, అతడి కొడుకు వీర ఎంటర్ అవుతారు. అలా కరుడుగట్టిన రౌడీలు, పోకిరీలతో ఓ నార్మల్ కానిస్టేబుల్ తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. చివరకు ఏమైంది? సదరు కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనేది తెలియాలంటే మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మూవీ చూడాల్సిందే.
Laththi innum rendu naal-la#SunNXT #Laththi #LaththiCharge #Vishal #Sunaina #Prabhu #Munishkanth #MeeshaGhoshal #ThalaivasalVijay #AVinothKumar @VishalKOfficial @TheSunainaa pic.twitter.com/XPRAP7TSMt
— SUN NXT (@sunnxt) January 12, 2023