ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సినిమా ‘కార్తికేయ 2‘. మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. యువనటుడు నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా.. 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా తెరపైకి వచ్చింది. అభిషేక్ అగర్వాల్, టీజె విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వం వహించాడు.
ఇక ఆగష్టు 13న థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన కార్తికేయ 2.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 120 కోట్ల గ్రాస్, రూ. 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ విడుదలైన ఈ సినిమా.. దాదాపు నాలుగింతలు ప్రాఫిట్స్ రాబట్టడం విశేషం. కృష్ణతత్వం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన కార్తికేయ 2 సినిమాకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక కార్తికేయ 2 మలయాళం వెర్షన్ సెప్టెంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
ఇదిలా ఉండగా.. ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కావాల్సిందే కదా.. ఈ క్రమంలో కార్తికేయ 2 కూడా ఓటిటి రిలీజ్ కి రెడీ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే.. కార్తికేయ 2 సినిమా ఓటిటి హక్కులను జీ స్టూడియోస్ వారు దక్కించుకోగా.. సినిమా ‘జీ5’లో స్ట్రీమింగ్ కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. కార్తికేయ 2 మూవీ సెప్టెంబర్ 30 నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ కాగా, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. మరి కార్తికేయ 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#karthikeya2 ott update#nikhil #nikhilsiddhartha #anupamaparmeswaran #anupamkher #adithya #superstar #youngtiger #powerstar #megastar #megapowerstar #rebelastar #stylishstar #naturalstar pic.twitter.com/NxR8MSxFRO
— Aniket Nikam Creations (@ANikamCreations) September 10, 2022