ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న సినిమాలే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఎందుకంటే.. జనాలకు కోరుకుంటుంది భారీ ప్రమోషన్స్ కాదు.. కొత్త కంటెంట్ కావాలి అనేది ప్రూవ్ అవుతూ వస్తోంది. ఇక రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది ‘కార్తికేయ 2‘. తెలుగు యువనటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇక కృష్ణతత్త్వం నేపథ్యంలో మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ.. 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా వచ్చింది. కాకపోతే దేని స్టోరీ దానిదే. చందూ మొండేటి రూపొందించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, టీజె విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రలలో మెప్పించారు. ఈ క్రమంలో ఆగష్టు 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన కార్తికేయ 2 చిత్రం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి దాదాపు రూ. 60 కోట్ల షేర్ వసూల్ చేసింది.
ఇటీవలే సెప్టెంబర్ 23న కార్తికేయ 2 మలయాళం వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉండగా.. కార్తికేయ విడుదలై 50 రోజులు పూర్తవుతుండటంతో ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంతా ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటిటి రిలీజ్ తప్పనిసరి. కానీ.. కార్తికేయ 2 క్రేజ్ వేరు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఇక దసరా పండుగ సందర్భంగా కార్తికేయ 2.. జీ5లో అక్టోబర్ 5 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రీక్వెల్ కార్తికేయ 3 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
#Karthikeya2 will be Stream From October 5th on #Zee5
Kannada , Tamil , Telugu , Hindi pic.twitter.com/En83lNQuOc
— OTT Prime News (@Ottupdates7) September 26, 2022