కార్తీకి టాలీవుడ్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీ నటించిన ఎన్నో సినిమాలు స్ట్రైట్ తెలుగు సినిమాల్లాగానే వసూళ్లు రాబట్టాయి. అన్న సూర్యాకు తగ్గట్లుగానే కార్తీ కూడా ఇక్కడ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కార్తీ నటించాడు అంటే మినిమం గ్యారెంటీ చిత్రం అనే నమ్మకాన్ని పొందాడు. తెలుగు ప్రేక్షకులు చూపించే అభిమానానికి ఒక్కొక్కసారి కార్తీ కూడా ఆశ్చర్యపోతుంటాడు. ఒక్కోసారి నా సినిమాకి తమిళనాడులో కూడా ఇంత రెస్పాన్స్ రాదు అంటూ చెప్పుకుని ఆనంద పడటం చూశాం. తాజాగా కార్తీ డబుల్ రోల్‌లో నటించిన స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.
సర్దార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేయడం మాత్రమే కాదు.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సర్దార్ సినిమాని థియేటర్‌లో చూసిన అభిమానులు సైతం ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడు రిలీజ్ అవబోతోంది అనే సమాచారం రానే వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఆహాలో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఓటీటీ ప్రమోషన్స్ కోసం కార్తీ ఒక వీడియో కూడా చేశాడు. ‘సర్దార్ రావాలంటే కోడ్ రెడ్ రావాలి.. సర్దార్ సినిమా చూడాలంటే ఆహా సబ్‌స్క్రైబ్ చేసుకుంటే చాలు. నవంబర్ 18 నుంచి ఆహాలో సర్దార్ సినిమా చూడండి” అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు.
Ee Season Athi Pedda Blockbuster Cinema, Biggest Box-office Sensation, Mass Action Blockbuster, Karthi’s SARDAR mee Aha lo November 18 nundi.#SardarOnAHA @Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @AnnapurnaStdios @ActressLaila pic.twitter.com/CJooQy7j54
— ahavideoin (@ahavideoIN) November 11, 2022
సర్దార్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ ప్రకాశ్(కార్తి) ఒక పోలీస్ ఆఫీసర్. అతను ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూ ఉంటాడు. ఏం పని చేసినా మీడియా కచ్చితంగా ఉండాల్సిందే. ఓ కేసు సాల్వ్ చేసి పాపులర్ అవుదామనుకుని.. అతను ఎంతగానో ద్వేషించే తన తండ్రి సర్దార్(కార్తి)ని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సర్దార్ ఏం చేసేవాడు అనేది ఆహాలో చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇలాంటి స్పై థ్రిల్లర్‌తో వచ్చిన సర్దార్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సర్దార్ సినిమా నవంబర్ 18 నుంచి ఆహాలోనే స్ట్రీమింగ్ కాబోతోంది.