పాన్ ఇండియా సినిమా 'కబ్జ' ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైపోయింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాన నెల తిరగకుండానే బుల్లితెరపైకి తీసుకొచ్చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
థియేటర్లలోకి ఏదైనా కొత్త సినిమా రావడం లేటు.. అది ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చూసే జనాలు చాలామంది ఉంటారు. కాకపోతే దీన్ని బయటకు చెప్పుకునేది చాలా తక్కువమంది. అలా ఈ మధ్య కాలంలో బాగా ఇంట్రెస్ట్ చేసిన సినిమా అంటే ‘కబ్జ’ అని చెబుతారు. ‘కేజీఎఫ్’ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో పాటు ట్రైలర్ కూడా బాగుండేసరికి ఎక్స్ పెక్టేషన్స్ బాగానే పెరిగాయి. కట్ చేస్తే థియేటర్లలో మూవీ చూసిన ఆడియెన్స్ మాత్రం షాకయ్యారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడ సినిమా ఇండస్ట్రీ రేంజుని పెంచిన సినిమా ‘కేజీఎఫ్’. రెండు పార్ట్స్ వస్తే అవి అదిరిపోయే సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. రూ.1500 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అదరహో అనిపించాయి. గతేడాది వచ్చిన ‘కాంతార’ కూడా శాండల్ వుడ్ స్థాయిని పెంచేసింది. దీంతో పాన్ ఇండియా ప్రేక్షకులు చూపు.. కన్నడ నుంచి వచ్చే సినిమాలపై పడింది. అలా ఈ మధ్య కాలంలో ఉపేంద్ర హీరోగా నటించిన ‘కబ్జ’ కోసం బాగానే వెయిట్ చేశారు. సుదీప్, శివరాజ్ కుమార్ లాంటి యాక్టర్స్ ఉండేసరికి హిట్ కొట్టేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ‘కేజీఎఫ్’ అనుకరించాలనే ఆత్రుత వల్ల మొత్తం ఫెయిలైంది.
ఇకపోతే ‘కబ్జ’ ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. ఏప్రిల్ 14న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సరేలే ఆ వీకెండ్ కి ఏదైనా సినిమా చూద్దామనుకుంటే మాత్రం మీరు ‘కబ్జ’ని ట్రై చేయొచ్చు. విజువల్, మేకింగ్ పరంగా ‘కబ్జ’ని గ్రాండ్ గా తీసినప్పటికీ చాలా విషయాల్లో పొరపాట్లు చేయడంతో సగం సగం గానే మిగిలిపోయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘కబ్జ’కు సీక్వెల్ కూడా ఉంది. అందులో శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తాడు. సుదీప్, ఉపేంద్ర కూడా ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ‘కబ్జ’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్ చేయండి.