ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. లాక్ డౌన్ నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ, డిమాండ్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే సదరు సంస్థలు.. రిలీజ్ అయిన కొత్త సినిమాలను తక్కువ టైంలోనే ఆడియెన్స్ ముందు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాయి. గతంలో మినిమమ్ ఆరు లేదా మూడు నెలలకు ఓటీటీ రిలీజ్ అనేవారు. కానీ, కొన్నాళ్లుగా నాలుగు లేదా మూడు వారాలకే రిలీజ్ అవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న సినిమాలు తప్ప.. మిగతా సినిమాలన్నీ దాదాపు కొన్ని రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. సరే రిలీజ్ అయ్యాక నెల రోజులు గ్యాప్ వచ్చిందంటే ఓకే అనుకోవచ్చు. కానీ.. ఇటీవల కొత్తగా విడుదలైన సినిమా.. కేవలం 15 రోజులకే ఓటీటీ రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతాం. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘హంట్’ మూవీ విషయంలో ప్రేక్షకులు ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైన హంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఫిక్సయింది. ఇక ‘హంట్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని కూడా సోషల్ మీడియాలో ప్రకటించింది. అవును.. హంట్ మూవీ విడుదలైన 15 రోజులకే.. అంటే ఫిబ్రవరి 10న ‘హంట్’ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ట్వీట్ చేసింది. ఈ సినిమా ‘ముంబయి పోలీస్'(2013) అనే మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో మహేష్ సూరపనేని ఈ మూవీకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. థియేట్రికల్ గా సినిమా ఎలా వర్కౌట్ అయ్యింది అనే విషయం పక్కన పెడితే.. రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటిటికి రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. మరి ‘హంట్’ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Get ready for the action-packed #HuntTheMovie thriller movie releasing on Feb 10 on aha.#HuntTheMovieOnAHA Premieres Feb 10@isudheerbabu @_apsara_rani @actorsrikanth @bharathhere @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @adityamusic pic.twitter.com/qGghi97ip0
— ahavideoin (@ahavideoIN) February 9, 2023