Happy Birthday: ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ అతి తక్కువ సమయంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర హిట్టై, కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలైనా ఓటిటిలోకి రావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుందేమో. కానీ.. బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకొని నిరాశపరిచిన సినిమాలు నెల తిరిగేలోపే ఓటిటి వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు నెల రోజులు, రెండు వారాలకు కూడా ఓటిటిలో రిలీజ్ అయ్యాయి.
ఈ క్రమంలో ఇటీవల థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి మరో తెలుగు సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధమైంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ఇటీవల జూలై 8న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఇక థియేట్రికల్ విడుదలైన నెలకు అంటే.. సరిగ్గా ఆగష్టు 8న నెట్ ఫ్లిక్స్ వేదికగా హ్యాపీ బర్త్ డే మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇక ఈ విషయాన్ని స్వయంగా నెట్ ఫ్లిక్స్ వారే అధికారికంగా ప్రకటించారు. అయితే.. కామెడీ ఎంటర్టైనర్ గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. కొత్త తరహా ట్రీట్మెంట్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాగే ఫామ్ లో ఉన్న మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తానికి నెల రోజులకే ఓటిటిలో రిలీజ్ కాబోతున్న ‘హ్యాపీ బర్త్ డే’ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#HappyBirthday @Netflix_INSouth pic.twitter.com/oHecQRi5PD
— Aakashavaani (@TheAakashavaani) August 1, 2022