Netflix: ఈ మధ్య ఓటీటీ ఫ్లాట్ ఫాంల హవా విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్‌డౌన్‌తో మొదలైన ఓటీటీ హవా.. లాక్‌డౌన్ తగ్గినా కూడా అలానే కొనసాగుతోంది. పెద్ద సినిమాలనుంచి చిన్న సినిమాల వరకు అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు! క్రికేట్ మ్యాచ్‌లనుంచి పలు టీవీ ఛానళ్ల సీరియల్స్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సీరియల్స్ టీవీలో కంటే ఓ ఎపిసోడ్ ముందుగానే ఓటీటీలో చూసే అవకాశం ఉన్నందున జనం సబ్‌స్క్రిప్షన్స్ కోసం ఎగబడుతున్నారు. అలా జనం మెచ్చిన ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒకటి.
ఈ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. సబ్‌స్క్రిప్షన్స్‌కు సంబంధించి మరో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ను దాటేసింది. జులై 2వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 221.1 మిలియన్ల సబ్‌స్క్రిప్షన్స్‌ను పొందింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, దాని అనుబంధ సంస్థలైన హులు, ఈఎస్‌పీఎన్‌లు కలిపి ఈ ఘనత సాధించాయి. ఆరు నెలల్లో 14.4 మిలియన్ల సబ్‌స్క్రిప్షన్స్ అయ్యాయని సంస్థ తెలిపింది.
ఈ సబ్‌స్క్రిప్షన్స్‌లో చాలా వరకు యూఎస్ వెలుపలి నుంచి వచ్చినవేనని పేర్కొంది. అయితే, ఐపీఎల్ హక్కులు కోల్పోయిన నేపథ్యంలో ఈ సబ్‌స్క్రిప్షన్స్ తగ్గే అవకాశం ఉందని డిస్నీ భావిస్తోంది. త్వరలో యాడ్ ఫండెడ్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఇక, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్‌ను కోల్పోయి 220.67మిలియన్లకు పరిమితం అయింది. మరి, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. నెట్‌ఫ్లిక్స్‌ను దాటేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రేపు ఒక్కరోజే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 21 సినిమాలు!