దక్షిణాది స్టార్ హీరో ధనుష్ కి కోలీవుడ్ తో పాటు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. 3, రఘువరన్ బీటెక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్.. ఆ తర్వాత మారి, అనేకుడు, మరియన్, మారి 2, అసురన్, కర్ణన్ సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. అయితే.. ధనుష్ చేసే అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ధనుష్ నుండి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘తిరు’.
ఆగష్టు 18న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే.. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా ఇటీవల దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీ కలెక్షన్స్ ని దాటి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ధనుష్ ని ఈ ఏడాది 100 కోట్ల క్లబ్ చేర్చిన సినిమాగా తిరు నిలిచింది. ఈ క్రమంలో సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన బయటికి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సన్ పిక్చర్స్ వారి సన్ నెక్స్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటిటి సంస్థ సొంతం చేసుకుంది.
ఇక థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన తిరు.. విడుదలైన నెల రోజుల తర్వాత ఓటిటిలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 23 నుండి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ధనుష్ మిడిల్ క్లాస్ యువకుడిగా డెలివరీ బాయ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, భారతీరాజా, రాశిఖన్నా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా.. దర్శకుడు మిత్రన్ జవహర్ మూవీని తెరకెక్కించారు. మరి తిరు సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
The most anticipated #Thiruchitrambalam streaming worldwide from Sept 23rd only on #SunNXT! Watch it in 4K and Dolby Atmos!#ThiruchitrambalamOnSunNXT@dhanushkraja @anirudhofficial #Bharathiraja @JoinPrakashRaj @MithranRJawahar @priya_Bshankar #NithyaMenen #RaashiiKhanna pic.twitter.com/pGUNchjN9j
— SUN NXT (@sunnxt) September 19, 2022