స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. 3 మూవీతో యూత్ కి దగ్గరైన ధనుష్.. రఘువరన్ బిటెక్, మారి, రైల్, అనేకుడు, తిరు లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి చేరువయ్యాడు. అయితే.. తిరు బ్లాక్ బస్టర్ తర్వాత ‘నేనే వస్తున్నా’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. సైకో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
ధనుష్ – సెల్వరాఘవన్ కాంబినేషన్ లో ఇదివరకు నాలుగు సూపర్ హిట్స్ తెరమీదకు వచ్చాయి. దీంతో ఐదోసారి కూడా కలిసి చేసేసరికి నేనే వస్తున్నా మూవీపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ట్రైలర్, సాంగ్స్ తో ఆసక్తిరేపిన ఈ సినిమా, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో విఫలమైంది. ఇక థియేట్రికల్ గా నిరాశపరిచిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. నేనే వస్తున్నా(తమిళంలో నానే వరువేన్) స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలో సినిమా ఎలాగో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. కాబట్టి, థియేట్రికల్ రిలీజైన నెల రోజులకే ఓటిటి రిలీజ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వారు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా నేనే వస్తున్నా చిత్రం.. అక్టోబర్ 27 నుండి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్నీ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను థియేటర్స్ లో మిస్సయిన వారంతా ఓటిటిలో ఎంజాయ్ చేయవచ్చు. సో.. ధనుష్ యాక్టింగ్, యువన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సెల్వరాఘవన్ యూనిక్ డైరెక్షన్ ని ఇష్టపడేవారికి ‘నేనే వస్తున్నా’ మంచి థ్రిల్ కలిగిస్తుందని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ చిత్రాన్ని ఓటిటి ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో!
a war between the light and the shadow ☄ #NaaneVaruvenOnPrime, Oct 27@theVcreations @dhanushkraja @selvaraghavan @thisisysr @omdop @RVijaimurugan @theedittable @saregamasouth pic.twitter.com/i44cdRTfz7
— prime video IN (@PrimeVideoIN) October 22, 2022