ఎప్పుడు ఏ సినిమా.. ప్రేక్షకులకు నచ్చుతుందనేది అస్సలు చెప్పలేం. వాటిలో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ పక్కా ఉంటాయి. ఎందుకంటే అలాంటి మూవీస్ స్టోరీస్ ఏంటనేది మనకు ట్రైలర్ చూడగానే అర్థమైపోతుంది. కానీ కొన్నిసార్లు ఆయా చిత్రాల బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయిపోతాయి. అలా ఈ మధ్య కాలంలో క్లిక్ అయిపోయిన సినిమా ‘ధమాకా’. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇంకా వసూలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు వచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా, గతేడాది డిసెంబరు 23న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో తీశారు. స్టోరీ కూడా కొత్తది ఏం కాదని చాలామంది రివ్యూలు ఇచ్చారు. కానీ అనుహ్యంగా ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. రవితేజ ఎనర్జీ, కామెడీకి తోడు.. హీరోయిన్ శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అదే టైంలో సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేం లేకపోవడంతో ‘ధమాకా’ బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయిపోయింది.
అలా ఇప్పటివరకు ‘ధమాకా’ సినిమా.. వరల్డ్ వైడ్ 18 రోజుల్లో 108 కోట్ల గ్రాస్ సాధించిందని నిర్మాణ సంస్థే పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా థియేటర్ కి వెళ్లి చూసేవారితో పాటు ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు కూడా ఉంటారు. వారి కోసమే అన్నట్లు రిలీజ్ డేట్ ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ లో జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ఇది తెలిసి రవితేజ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. అలానే ఈసారి కాకుండా వచ్చే వీకెండ్ కి చూడటానికి మూవీ దొరికేసిందని ఓటీటీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ‘ధమాకా’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.
#Dhamaka OTT RELEASE JAN 22#DhamakaBlockBuster in Cinemas Now@NetflixIndia @Netflix_INSouth pic.twitter.com/m2YyJLi1do
— OTTGURU (@OTTGURU1) January 11, 2023