నాని 'దసరా' థియేటర్లలోకి వచ్చేసింది. మాస్ బొమ్మ కావడంతో ప్రేక్షకులు కూడా బాగా ఎంటర్ టైన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే 'దసరా' ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి.
ప్రేక్షకులకు మిగతా సినిమాలు ఏమో గానీ మాస్ మూవీస్ చూసేటప్పుడు వచ్చే కిక్ మాత్రం వేరే లెవల్ ఉంటుంది. రీసెంట్ టైంలో అయితే ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ సినిమాలు అలాంటి హై ఇచ్చాయి. ఇప్పుడు ఆ రూట్ లోనే వచ్చిన చిత్రం ‘దసరా’. నేచురల్ నాని నుంచి పాన్ ఇండియా రిలీజైన ఫస్ట్ మూవీ ఇది. ఆల్రెడీ చాలాచోట్ల షోలు పడిపోయాయి. టాక్ కూడా పాజిటివ్ గా వచ్చేసింది. థియేటర్లు మొత్తం ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ‘దసరా’ ఓటీటీ గురించి క్రేజీ డీటైల్స్ వచ్చేశాయి. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా ప్రేక్షకులు బాగా కమర్షియల్ అయిపోయారు. సినిమా బాగుంటే థియేటర్ లో చూస్తారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరోసారి షో వేస్తారు. తాజాగా నాని హీరోగా నటించిన ‘దసరా’ థియేటర్లలోకి వచ్చేసింది. ఆల్రెడీ చాలామంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. కొందరు ఇప్పటికే చూసేయగా, మరికొందరు చూసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇక కొత్త సినిమా రిలీజ్ కావడమే లేటు.. అది ఏ ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కూడా ఉంటారు. వాళ్ల కోసమే ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ తో వచ్చేశాం.
నాని-కీర్తి సురేష్ నటించిన ఈ ‘దసరా’ ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కానీ థియేటర్లలో మరోసారి నెట్ ఫ్లిక్స్ బొమ్మ పడటంతో అది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే సినిమాకు ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే 5-6 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే ఛాన్సుంది. అంటే మే ప్రారంభంలో ప్రేక్షకులకు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే ‘దసరా’ని మీలో ఎంతమంది చూశారు? ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి.