'దసరా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. నెట్ ఫ్లిక్స్ ఆ తేదీని అధికారికంగా తన ఓటీటీలో అనౌన్స్ చేసింది. దీంతో మూవీ లవర్స్ చూసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.
నేచులర్ స్టార్ నాని అనగానే పక్కింటి కుర్రాడి తరహా సినిమాలే గుర్తొస్తాయి. ఇప్పటివరకు దాదాపు అలాంటి మూవీస్ చేస్తూ వచ్చాడు. అలాంటి ఫస్ట్ టైమ్ పూర్తిగా మాస్ అవతార్ లో దర్శనిమిచ్చిన చిత్రం ‘దసరా’. మార్చి 30న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మిగతా చోట్ల మాత్రం ఓ మాదిరి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. అందుకు సంబంధించిన అఫీషియన్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో రస్టిక్ మాస్ మూవీస్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. కేజీఎఫ్, పుష్ప.. ఆ జానర్ లోనే వచ్చి ఆలోవర్ ఇండియా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అలా నాని చేసిన ఈ తరహా ప్రయత్నమే ‘దసరా’. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంగా ఈ సినిమా తీశారు. వీర్లపల్లి అనే ఊరు, అందులో జరిగే రాజకీయాల వల్ల ధరణి, వెన్నెల, సూరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేది ఈ మూవీ స్టోరీ. కొత్తగా ఏం లేనప్పటికీ నాని-కీర్తి సురేష్ యాక్టింగ్ తో ఇచ్చిపడేశారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ‘దసరా’.. తొలి సినిమానే అయినప్పటికీ చిన్న చిన్న మిస్టేక్స్ మినహా చాలా చక్కగా తీశాడు. దీంతో థియేటర్స్ కి వెళ్లి చాలామంది ఈ మూవీ చూశారు. అలానే ఓటీటీ కోసం వెయిట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. వాళ్లకోసమే అన్నట్లు ఏప్రిల్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలో వచ్చేస్తుంది అనమాట. నెట్ ఫ్లిక్స్ లో తన ఓటీటీలో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరి ‘దసరా’ ఓటీటీ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? కింద కామెంట్ చేయండి.
#Dasara OTT RELEASE #Netflix From April 27#DasaraOnNetflix pic.twitter.com/Pv2duLECVz
— OTTGURU (@OTTGURU1) April 20, 2023