యంగ్ హీరో విశ్వక్ సేన్ 'ధమ్కీ'... ఓటీటీలోకి వచ్చేసింది. కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా ఎంటర్ టైన్ చేస్తోంది.
ఓటీటీలోకి ఏదైనా కొత్త మూవీ రావడం లేటు. మూవీ లవర్స్ చూసేందుకు ఎగబడతారు! థియేటర్ లో మిస్ అయినవాళ్లతో పాటు చూసినవాళ్లు మళ్లీ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఉన్నది ఓటీటీలోనే కాబట్టి టైం ఉన్నప్పుడు అంటే అలా భోజనం చేసిన తర్వాతో, టైం ఫ్రీగా ఉన్నప్పుడో ఓ లుక్కేస్తుంటారు. అలా ఈ వీకెండ్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా.. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ తెగ సందడి చేసేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు ఆడియెన్స్ థియేటర్స్ కి వెళ్లి చూడటంతో పాటు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. గత రెండు మూడేళ్లనే తీసుకుంటే.. ప్రతివారం పదుల సంఖ్యలో కొత్త మూవీస్ వస్తూనే ఉన్నాయి. అలా తాజాగా ఆహాలో రిలీజ్ అయిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ హీరో కావడంతో ప్రేక్షకులు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోయిన్ నివేతా పేతురాజ్ గ్లామర్ కూడా ఇందులో కాస్త గట్టిగానే చూపించినట్లు ఉంది. అలానే డ్యూయర్ రోల్ లో విశ్వక్ ఇచ్చిపడేశాడు. మరి ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? కింద కామెంట్ చేయండి.