ఒక భాషలో హిట్ అయిన సినిమాలను.. ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటినుండో జరుగుతోంది. కంటెంట్ ఉన్న సినిమాలు నచ్చితే.. ఏ భాషలోనైనా సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. మలయాళంలో సూపర్ హిట్టై.. రీమేక్ అయిన సినిమాలలో 'కప్పేలా' ఒకటి. తెలుగులో ఈ సినిమాని రీసెంట్ గా 'బుట్టబొమ్మ' పేరుతో రీమేక్ చేశారు. ఈ క్రమంలో బుట్టబొమ్మ ఓటిటికి సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ఒక భాషలో హిట్ అయిన సినిమాలను.. ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటినుండో జరుగుతోంది. వేరే భాషలో ఆదరణ పొంది సూపర్ హిట్ అయిన సినిమాలను.. రీమేక్ చేస్తే ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు రెడీగానే ఉంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు నచ్చితే.. ఏ భాషలోనైనా సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా ఇండియా సినిమాలు రాకపోయినా.. మలయాళం ఇండస్ట్రీ నుండి చాలా సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్/డబ్ అవుతున్నాయి. ఇదివరకంటే ఓటిటిలు లేవు కాబట్టి.. రీమేక్ సినిమాలను కూడా జనాలు చాలా కొత్తగా చూసేవారు.
ఓటిటిలు వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. అన్ని భాషల సినిమాలను ఇంట్లో కూర్చనే చూస్తున్నారు. కాబట్టి.. రీమేక్ సినిమాలైనా కొత్తగా ప్రెజెంట్ చేస్తేనే చూస్తున్నారని చెప్పవచ్చు. మలయాళంలో సూపర్ హిట్టై.. రీమేక్ అయిన సినిమాలలో ‘కప్పేలా’ ఒకటి. తెలుగులో ఈ సినిమాని రీసెంట్ గా ‘బుట్టబొమ్మ’ పేరుతో రీమేక్ చేశారు. అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాని నాగవంశీ. సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాని శౌరీ చంద్రశేఖర్ తెరకెక్కించారు. ఆల్రెడీ కప్పేలా ఓటిటిలో చూసేసరికి.. ఈ సినిమాపై పెద్దగా బజ్ రాలేదు. పైగా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద బుట్టబొమ్మ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.
ఈ క్రమంలో బుట్టబొమ్మ ఓటిటికి సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. కాగా.. మార్చి 4 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు నెల, రెండు నెలల్లోనే ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. ఆ లెక్కన బుట్టబొమ్మ నెలలోపే ఓటిటి రిలీజ్ అవుతోంది. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా డెబ్యూ చేసింది. సో.. బుట్టబొమ్మ, కప్పేలా వీటిలో ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి.
Telugu film #ButtaBomma Premieres March 4th on @NetflixIndia pic.twitter.com/FVKPq6Cg1p
— OTT Releases & Movie Updates (@OttMovie) February 28, 2023