Bimbisara OTT Release: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా ఏళ్ళ తర్వాత బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాడు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని నమ్మి.. ఈ సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కంటెంట్ గెలుస్తుందన్న నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేక్షకులు బింబిసార మూవీని బ్లాక్ బాస్టర్ హిట్ చేసిచ్చారు. కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొదటిరోజు రూ. 6.3 కోట్లు షేర్, రూ. 9.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
మంచి టాక్ కారణంగా మున్ముందు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘జీ స్టూడియోస్’ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ 5లో బింబిసార రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత ఓటీటీలకు ఇవ్వాలన్న రూల్ ఉన్నందున.. 8 నెలల తర్వాతే జీ5లోకి వచ్చే అవకాశం ఉంది. మరి, ‘బింబిసార’ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sita Ramam OTT Release: ఆ ప్రముఖ ఓటీటీలోకి సీతా రామం మూవీ!