బిగ్ బాస్ ఈ రియాలిటీ షో ద్వారా సెలబ్రిటీలు అయినవారు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటూ అంత పాపులారిటీ లేనివాళ్లు ఒక్కసారిగా స్టార్లు అయిన సందర్భాలు చాలా చూశాం. ఇప్పుడు ఓ బిగ్ బాస్ ఫేమ్ నటి యాక్ట్ చేసిన ఓ లెస్బియన్ చిత్రం ఆగస్టు 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కాకపోతే తెలుగు నటి కాదులెండి. మలయాళం ఇండస్ట్రీకి చెందిన జానకి సుధీర్, అమృతా వినోద్, సాబు ప్రౌదిక్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ‘హోలీవుండ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
సపోర్టింగ్ రోల్స్, మోడలింగ్ లో బిజీగా ఉండే జానకి సుధీర్‌కు బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్, ఫాలోయింగ్ వచ్చాయి. ప్రస్తుతం లెస్బియన్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా గురించి సినీ వర్గాల్లో పెద్దఎత్తునే చర్చ నడుస్తోంది. నిజానికి కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘హోలీవుండ్’ భారత్‌లో చిత్రీకరించి విడుదల చేసిన తొలి లెస్బియన్ చిత్రం అవుతుంది.
ఈ సినిమాని ఎస్‌ఎస్ ఫ్రేమ్స్ వారి ఓటీటీలో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ కలిగి.. శారీరకంగా కలుస్తూ వారి సుఖాలను తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు జరిగాయనేదే కథ” అంటూ చెప్పుకొచ్చాడు. హోలీవుండ్ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.