ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్.కె.ఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బేబి’. జూలై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రెండో వారంలోనూ స్టడీ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్.కె.ఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బేబి’. జూలై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రెండో వారంలోనూ స్టడీ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో ‘బేబి’ తెరకెక్కించినట్లు సమాచారం. మొదటివారం రూ.49.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 8వ రోజుకి రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసి, వరల్డ్ వైడ్ రూ.54 కోట్లు కొల్లగొట్టింది. 9 రోజుల్లో రూ.60 కోట్లకు పైగా గ్రాస్ మీడియం రేంజ్ సినిమాల్లో ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే ఆమె చేసిన పాత్రను దారుణంగా తిడుతున్నారు. ఆనంద్ అద్భుతమైన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. వీరిద్దరికి తగ్గకుండా తన రోల్ పర్ఫెక్ట్‌గా చేశాడు అశ్విన్ విరాజ్.
‘బేబి’ మూవీ చూసి.. రవితేజ, సుకుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు టీంమ్‌ను అభినందించారు. అల్లు అర్జున్ ‘బేబి’ అప్రిషియేషన్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా ‘బేబి’ ఓటీటీ పార్ట్‌నర్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అలాగే రిలీజ్ అయిన నెల (జూలై 14) రోజుల తర్వాత ఆగస్టు 15న స్ట్రీమింగ్ చెయ్యనున్నట్లు సమాచారం. హాలీడే కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఆల్ రెడీ బిగ్ స్క్రీన్‌పై చూసిన వారు, చూడని వారు కూడా చూసే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
కట్ చేస్తే, ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తుంది. ‘బేబి’ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసే విషయం ఏంటంటే.. విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సంస్థ.. 4-5 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్లలో ఊహించని రెస్పాన్స్ రావడంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: బ్లాక్ బస్టర్ ‘బేబి’ మూవీకి వీళ్ల ముగ్గురి రెమ్యునరేష్ ఎంతో తెలుసా?