ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. సబ్స్క్రిప్షన్ ధరలను ఒక్కసారిగా పెంచేసింది.
గడిచిన మూడేళ్ల కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి సబ్ స్క్రైబర్లు బాగా పెరిగారు. అందుకే కొత్త కొత్త ఓటీటీలు కూడా పుట్టుకొస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు కంటెంట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడున్న ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్ కు కాస్త ఎక్కువ వ్యూయర్ షిప్, ఆదరణ ఉందని చెప్పచ్చు. ఇందుకు ప్రధాన కారణం అందులో అన్ని భాషల కంటెంట్ బాగా లభిస్తుంది. మరోవైపు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా అందుబాటులో ఉంటాయి. రెండో కారణం.. అమెజాన్ సబ్ స్క్రిప్షన్ చాలా ఓటీటీలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. కానీ, ఇప్పుడు ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ షాకిచ్చింది.
సాధారణంగా అమెజాన్ ను ఆదరించడానికి ముఖ్యమైన తక్కువ సబ్ స్క్రిప్షన్ ను ఇప్పుడు ప్రైమ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ వార్త వినగానే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కాస్త నిరుత్సాహ పడతారు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తమ మంథ్లీ మెంబర్ షిప్ ధరను ఏకంగా 67 శాతం పెచేసింది. పైగా పెంచిన రేట్లు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించింది. అయితే ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి 2024 జనవరి 15 వరకు గతంలో ఉన్న ధరనే కొనసాగించనున్నారు. కానీ, ఏ కారణం చేతనైనా మీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ పోతే.. మళ్లీ కొత్త ధరలతోనే మీరు ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
పెరిగిన ప్రైమ్ మెంబర్ షిప్ ధరలను చూసుకుంటే.. నెలవారీ చందా గతంలో రూ.179గా ఉండేది. ఇప్పుడు దానిని నెలకు రూ.299కి పెంచారు. త్రైమాసిక చందా గతంలో రూ.459గా ఉండేది. ఆ ప్లాన్ ను ఇప్పుడు ఏకంగా రూ.599కి పెంచేశారు. ఇక్కడ ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. ఏడాది ప్లాన్ లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్నట్లుగానే రూ.1,499కే అందిస్తున్నారు. మరోవైపు అమెజాన్ లైట్ సబ్ స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఏడాదికి రూ.999 చెల్లించి.. ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ లో ఉండి అన్ని వెసులుబాట్లను మీరు పొందవచ్చు. కాకపోతే ఈ ప్లాన్ లో మీకు యాడ్స్ వస్తాయి. కంటెంట్ ని మీరు SD క్వాలిటీలోనే చూడాల్సి ఉంటుంది.
Amazon Prime monthly, quarterly subscription prices hiked; cost of annual plan remains unchanged: Reporthttps://t.co/RiMeh1cEf4 pic.twitter.com/fLhzmtgiWD
— Gadgets 360 (@Gadgets360) April 26, 2023