హీరో అజిత్ కుమార్‌కి తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అజిత్ ఏ సినిమా చేసినా.. తెలుగులో డబ్ వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. కొన్నాళ్లుగా వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న అజిత్.. డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ నచ్చితే వాళ్ళతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటారు. గతంలో డైరెక్టర్ శివతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన అజిత్.. గత కొన్నాళ్లలో నేర్కొండ పార్వై, వలిమై, తెగింపు సినిమాలు దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్ లో చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘తెగింపు'(తమిళంలో తునివు) బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకి పోటీగా దళపతి విజయ్ నటించిన వారసుడు కూడా రిలీజ్ అయ్యింది. రెండింటి మధ్య రసవత్తరమైన పోటీ నెలకొనేసరికి కలెక్షన్స్ ఏది ఎక్కువ కొడుతుందా అని వెయిట్ చేశారు. ఓపెనింగ్స్ లో అజిత్ కుమార్ రూ. 41 కోట్లతో పైచేయి సాధించాడు. ఓవరాల్ గా మాత్రం రూ. 150 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. ఇక సినిమాని బోనీ కపూర్ నిర్మించగా.. జిబ్రాన్ సంగీతం అందించాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ సినిమాలో ఫైట్ సీన్స్ కిరాక్ అనే రేంజ్ లో డిజైన్ చేశారు. అందుకు తగ్గట్లే యాక్షన్ లవర్స్ కి ఈ మూవీ చాలా నచ్చేసింది. ఇక థియేటర్లలో చూడలేకపోయిన చాలామంది ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేశారు.
ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లు ‘తెగింపు’ ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. జనవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకే వచ్చేయబోతుంది. నెట్ ఫ్లిక్స్(Netflix)లో ఫిబ్రవరి 8 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగానే ఓ ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ఎంత సందడి చేశారో.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అంతే సందడి చేస్తున్నారు. మరి ఓటీటీలో ‘తెగింపు’ చూసేందుకు మీలో ఎంతమంది వెయిటింగ్? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Forecast: This week is going to be filled with guns, explosions and a WHOLE lotta action. 🤩💥
Thunivu is coming to Netflix on Feb 8th and we cannot stay CALM! 🤯#ThunivuOnNetflix pic.twitter.com/pOD8aEVBLV— Netflix India South (@Netflix_INSouth) February 6, 2023