ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీజియన్ నుండి పాన్ ఇండియా, హాలీవుడ్ సినిమాల వరకు ఏవి ఓటిటిలో రిలీజైనా.. ప్రేక్షకులు ఆదరించేందుకు రెడీగానే ఉన్నారు. అదీగాక కొన్నిసార్లు థియేటర్స్ లో ఫెయిల్ అయినా ఓటిటిలో సక్సెస్ అవుతున్నాయి సినిమాలు, వెబ్ సిరీసులు. అయితే.. మామూలుగా అన్ని ఓటిటిలు కలిపి నెలకు ఇరవై, ముప్పై సినిమాలు స్ట్రీమింగ్ చేసాయంటే ఓకే అనుకోవచ్చు. కానీ.. ఒకే ఓటిటిలో దాదాపు 25 సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.
ప్రస్తుతం వరల్డ్ వైడ్ పాపులర్ అయినటువంటి ఓటిటిలలో ‘నెట్ ఫ్లిక్స్’ ఒకటి. అమెజాన్ ప్రైమ్ కన్నా ముందంజలో దూసుకుపోతున్న నెట్ ఫ్లిక్స్ లో.. ఇండియన్ సినిమాలకంటే ప్రపంచదేశాల భాషల్లోని సినిమాలన్నీ రిలీజ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో నవంబర్ మొదటి రెండు వారాలు.. అంటే ఫస్టాఫ్ కి సంబంధించి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల లిస్ట్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా 25 సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. ఇక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న, కాబోతున్న 25 సినిమాలు, సిరీస్ లేంటో చూద్దాం!