2018 సినిమా గురించి ఈ మధ్య అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. కోట్లకు కోట్లతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటి సంగతి?
2018 సినిమా.. ఈ మధ్య కాలంలో చాలామంది దీని గురించి మాట్లాడుకున్నారు. పేరుకే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులోనూ అనుకున్న దానికంటే ఎక్కువ రేంజులో కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.5 కోట్లకుపైగానే వసూళ్లు సాధించింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి ఊపు మీదున్న ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఏకంగా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు ప్రేక్షకులకు నిజంగా దండేసి దండం పెట్టినా తప్పులేదు. ఎందుకంటే కేజీఎఫ్, కాంతార, చార్లీ.. ఇలా లెక్కకు మించి డబ్బింగ్ సినిమాలని ఒరిజినల్ తెలుగు చిత్రాల కంటే ఎక్కువగా ఆదరించారు. కోట్లకు కోట్లకు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. అలా మే 5న మలయాళంలో రిలీజైన ‘2018’.. సొంత రాష్ట్రంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇప్పుడు తెలుగులోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 2018 వరదల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. ఎమోనషల్ చేస్తోంది.
అలా అంత బాగానే ఉంది అనుకునేలోపు ఈ మూవీని జూన్ 7 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఓన్లీ మలయాళం వరకే చేస్తారా? లేదా తెలుగు డబ్బింగ్ కూడా దీనితోపాటే విడుదల చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాను మీరు థియేటర్ లో ఎక్స్ పీరియెన్స్ చేస్తేనే అసలు మజా ఉంటుంది. ఒకవేళ అది కుదరకపోతే మాత్రం ఇంట్లో మంచి సౌండ్ సిస్టం, పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలో చూస్తే బెటర్. సో అదనమాట విషయం. మీలో ఎవరైనా ‘2018’ చూశారా? చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.
ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ!
The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV
2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory
@ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j— Sony LIV (@SonyLIV) May 29, 2023