దసరా, దీపావళి పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హవా మొదలైపోతుంది. ఇటీవల దసరా సందర్భంగా పలు థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలోనూ చాలా సినిమాలు సందడి చేశాయి. ఇప్పుడు రానున్న దీపావళిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని సినిమాలు థియేట్రికల్, ఓటిటి రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. అయితే.. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకంటే.. ఓటిటి మాధ్యమాలలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల కోసమే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ప్రేక్షకులు. ఇదివరకంటే పెద్ద, చిన్న హీరోల సినిమాలు థియేటర్స్ లో వస్తున్నాయంటే.. జనాలు ఎగబడి చూసేవారు.
ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీలో, ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓటిటిలు అందుబాటులో లేని టైములో ప్రేక్షకులంతా థియేట్రికల్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ.. రెండేళ్లుగా థియేటర్లకు వెళ్లే అవసరం అంతగా లేకుండా పోయింది. సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేగానీ జనాలు థియేటర్లకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో దీవాలికి వారం రోజుల ముందే చాలా సినిమాలు ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయాయి. జనాలకు నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు ప్రముఖ ఓటిటిలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, వూట్ లాంటివన్నీ సిద్ధంగా ఉన్నాయి.