క్రైం డెస్క్- ప్రేమ.. ఇది ఎంతకైనా తెగిస్తుంది. ప్రేమించిన వారి కోసం ప్రేమ ఏమైనా చేయిస్తుంది. ఎంతలా అంటే.. తమ వారి కోసం ఆఖరికి హత్యలను కూడా చేయిస్తుంది ప్రేమ. ఇదిగో సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కన్న కూతురు మరొకరిని ప్రేమించిందని ఏకంగా ఆమెనే మట్టు బెట్టిన ఘటన సంచలం రేపుతోంది.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో యువతి అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిది అత్యాచారం కాదని, కన్నతల్లే దారుణంగా హత్య చేసిందని పోలీసులు విచారణలో చేలింది. పక్కా పధకం ప్రకారం హత్య చేసి నేరాన్ని కూతురి ప్రియుడిపై నెట్టేందుకు ప్రయత్నించిన కసాయి తల్లి వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది.
తాను అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి సదరు తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. యువతిపై అత్యాచారం చేశారన్న వార్తతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఎట్టకేలకు ఛేదించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లికి చెందిన హన్మంతు, బుజ్జమ్మల కూతురు మౌనిక(16), ఉరి చివరలోని మామిడితోటలో శవమై కనిపించింది.
దీంతో ఆ ఉర్లో ఒక్కసారిగా కలకలం రేగింది, రాత్రి ఇంటి నుంచి వెళ్లిన కూతురు తెల్లారేసరికి తోటలో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు లభోదిబోమన్నారు. తన కూతురిని ఆమె ప్రియుడు అక్షర్ (24) అత్యాచారం చేసి హత్య చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంకేముంది ఓ యువతిపై అత్యాచారం చేసి, ఆ తరువాత చంపేశారని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.అప్రమత్తమైన పోలీసులు మూడు టీమ్‌లను ఏర్పాటు చేసి దర్యార్తు చేపట్టారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు, సాంకేతిక ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు. కన్నతల్లి బుజ్జమ్మ తన ప్రియుడు నర్సింహులుతో కలసి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కూతురు మౌనిక ప్రేమ వ్యవహారం నచ్చని తల్లి అతన్ని మర్చిపోవాలని పలుమార్లు హెచ్చరించింది.
ఐనా యువతి వినిపించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయిన తల్లి ఎలాగైనా కూతురు అడ్డు తొలగించుకోవాలని భావించింది. తన ప్రియుడు నర్సింహులుకి విషయం చెప్పి పక్కాగా ప్లాన్ చేసింది. రాత్రివేళ కూతురిని వెంటబెట్టుకుని ఊరి చివరలోని మామిడి తోటకు వెళ్లింది. అప్పటికే నర్సింహులు తోటకు చేరుకున్నాడు. ప్రియుడిని మర్చిపోవాలని ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు.