కడప క్రైం- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ ను విచారణకోసం సెంట్రల్ జైల్ నుంచి బయటికి తీసుకొచ్చారు. పటిష్టమైన పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ, సీబీఐ అధికారులు సునీల్ తో సాక్షాలు సేకరించేందుకు బయట గాలింపుచర్యలు చేపట్టాయి.
సీబీఐ విచారణలో సునీల్ కీలక సమాచారం వెల్లడించినట్లు సమాచారం. పులివెందులలోని రోటరిపురం వంక వాగులో సునీల్‌తో కలసి సీబీఐ బృందాలు విస్తృతంగా కనిఖీలు చేస్తున్నాయి. వివేకానంద హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం సునీల్ ను వెంటపెట్టుకుని గాలిస్తున్నట్లు తెలుస్తోంది. రోటరీపురం వాగులో సీబీఐ అధికారులు పైపుల ద్వారా నీటిని బయటికి తోడిస్తున్నారు.
వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్‌ను గోవాలో సీబీఐ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడ స్థానిక కోర్టులో హాజరపరిచి, అక్కడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌లో కడపకు తరలించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబందించి సీబీఐ సునీల్ యాదవ్‌ను పలుసార్లు ప్రశ్నించింది. సునీల్‌తో పాటు ఆయన తమ్ముడు కిరణ్‌యాదవ్, తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్‌లను సీబీఐ విచారించింది.
విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సునీల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పులివెందులలో ఇంటికి తాళం వేసి సునీల్ కుటుంబం పారిపోయింది. ఆప్పటి నుంచి సునీల్ కోసం తీవ్రంగా గాలిస్తుండగా గోవాల్ చిక్కాడు. రోటరిపురం వంక వాగులో వివేకాను హత్య చేసేందుకు ఉపయోగించిన మరణాయుధాలు దాచిపెట్టానని సునీల్ యాదవ్ చెప్పడం వల్లే అక్కడ సీబీఐ వేతుకుతోందని విశ్వనీయవర్గాల సమాచారం.