రాజకీయరంగం నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే నిస్వార్ధ వేదిక .అహోరాత్రాలు ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ దేశ పురోగతికి తోడ్పడుతూ తన పేరు చిర స్థాయిగా చరిత్రలో నిలిచి పోయేలా ఒక గుర్తింపు పొందటం అన్నది లక్ష్యంగా ఉండాలి .ఆ బాటలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి తన సత్తా చాటుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు.
అయితే, తాజాగా షర్మిల పార్టీ ఊహించని రీతిలో వార్తల్లోకి ఎక్కింది. ఆ పార్టీలో పదవులు అమ్ముడుపోతున్నాయట. చిత్రంగా వాటికి అంత డబ్బులు పెట్టిన వారు కూడా ఉన్నారట. ఓ నేత ఇలాంటి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాయకుడు కేటీ నరసింహారెడ్డి ఇలా వార్తల్లోకి ఎక్కారు పదవుల్లో చోటు దక్కలేదట!మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాయకుడు కేటీ నరసింహారెడ్డి వైఎస్ఆర్‌టీపీ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో తనకు చోటు దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ టీపీ అంతా కార్పొరేట్ వ్యవస్థ లాగా మారిందని, డబ్బులకు ఆశపడి పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. షర్మిల పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి అహర్నిశలు కష్టపడ్డానని అలాంటిది తనకు కాకుండా ఇతరులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. షర్మిలకు తెలియకుండా రాత్రికి రాత్రే పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలో పని చేసే వారికి గుర్తింపు ఇవ్వకుంటే మనుగడ కష్టమని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడేది లేదని స్పష్టం చేశారు షర్మిల!
పార్టీ ప్రకటన అనంతరం వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమై ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కూడా పర్యటించారు. నిరుద్యోగుల సమస్యలపై ఆమె వనపర్తి జిల్లా తాడిపత్రి గ్రామంలో షర్మిల పర్యటించారు. ఈ పర్యటన నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు షర్మిల ఉద్యోగ దీక్షలో తాను ఎంతో కృషి చేశానని సదరు నేత వాపోయారు. కాగా, షర్మిల పార్టీలో పదవులు అమ్ముడుపోవడం ఏంటో, దానిపై విమర్శలు రావడం ఏంటో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియ చేయండి