సమాజంలో పెద్ద వాళ్ళకి సంబంధించిన ఎలాంటి వార్త అయినా.. సామాన్యులకి ఇంట్రెస్టింగ్ గా అనిపించడం సాధారణం. అలాంటిది ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి పన్ను క్లియర్ చేయడంలో జాప్యం అయ్యి.., ఫైన్ కడితే ఆ న్యూస్ హాట్ టాపిక్ కావడం పెద్ద విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రస్తుతం ఇదే జరిగింది. మరి వై.ఎస్.జగన్ ఆస్తి పన్ను విషయంలో కట్టిన పెనాల్టీ ఎంత? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన సొంత భవనంలో నివాసముంటున్నారు. ఇందులో రెండు బ్లాక్ లు ఉన్నాయి. ఒకటి కార్యాలయం కాగా.. మరొకటి ఆయన నివాసం. ఆఫీసు వైశాల్యం 1750 చదరపు మీటర్లు. ఇక ఇదే ప్రాంగణంలో ఉన్ననివాస భవనం వైశాల్యం 219 చదరపు మీటర్లు. జీ+2 నిర్మించిన ఈ రెండు భవనాలు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి రెడ్డి పేరిట ఉన్నాయి.
కానీ.., సీఎం జగన్ వీటికి సంబంధించిన ఆస్తి పన్నుని చెల్లించడంలో జాప్యం జరిగింది.
ఆఫీసుకు ఏటా రూ.4,41,980, ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉన్నా.., జగన్ సీఎం అయిన నాటి నుండి ఇప్పటి వరకు ఆ చెల్లింపులు జరగలేదు. దీంతో.., మునిసిపల్ శాఖ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు దర్శనం ఇవ్వడంతో.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆస్తి పన్ను చెల్లించలేదన్న వార్త ఒక్క రోజులోనే వైరల్ అయిపోయింది. దీంతో.., జగన్ ఈ మొత్తం బిల్ ని తాజాగా క్లియర్ చేశారు.
ఆఫీస్ భవనానికి అసలు పన్ను రూ.13,25,940 కాగా.., పెనాల్టీ రూ.2,93,709 పడింది. ఇక నివాస భవనానికి అసలు పన్ను రూ.59,256 కాగా.., పెనాల్టీ రూ.11,484 పడింది. దీంతో.., సీఎం జగన్ మొత్తం రూ. 16,90,389 బిల్ ని చెక్ రూపంలో చెల్లించి, రశీదు తీసుకున్నారు. బిల్ చెల్లించడంలో జాప్యం కారణంగా జగన్ మోహన్ రెడ్డి మొత్తం మీద రూ.3,05,193 పెనాల్టీ రూపంలో అదనంగా చెల్లించాల్సి రావడం గమనార్హం.