బంధాల్ని నడిపిస్తుంది ఈ ధనమే. ధనమేరా అన్నిటికి మూలం అని ప్రముఖ సినీ కవి ఊరకనే అనలేదు. అయితే ఆపాద సమయానికి, అత్యవసరానికి మన దగ్గర డబ్బులు లేవనుకుంటే.. గబుక్కున ఎవరినైనా డబ్బులు అడగండి ఇస్తారేమో చూద్దాం.
డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. ఈ ప్రపంచం.. కాదు కాదు అసలు మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. పుట్టిన దగ్గర నుండి చావు వరకు మనుషుల్ని, బంధాల్ని నడిపిస్తుంది ఈ ధనమే. ధనమేరా అన్నిటికి మూలం అని ప్రముఖ సినీ కవి ఊరకనే అనలేదు. అయితే ఆపద సమయానికి, అత్యవసరానికి మన దగ్గర డబ్బులు లేవనుకుంటే.. గబుక్కున ఎవరినైనా డబ్బులు అడగండి ఇస్తారేమో చూద్దాం. అరే ఇప్పుడు వేరో వాళ్లు అడిగితే ఇచ్చానురా.. లేదా జీతం మొత్తం ఖర్చు అయిపోయిందని డబ్బులు లేవని డైరెక్టుగా చెప్పకుండా.. ఏవో కుంటి సాకులు చెబుతూ సరిపెట్టేస్తుంటారు. అటువంటి సమయంలోనే చర, స్థిరాస్థులు తనఖా పెట్టడం లేదా లోన్ కోసం వెళుతుంటారు.
మీకు డబ్బులు అవసరం పడ్డాయా.. అయితే లోన్ అప్లై చేయాలనుకుంటే.. ఈ వార్త మీ కోసమే. బ్యాంకులకు కాళ్లు అరిగేలా తిరగకుండా.. ఇంట్లో ఉండే సులభంగా లోన్ పొందే అవకాశం ఉంది. ఎలా అనుకుంటున్నారా..? ఆ అవకాశాన్ని అందిస్తుంది ప్రముఖ సంస్థ టాటా గ్రూప్. వివరాల్లోకి వెళితే.. టాటా గ్రూప్‌కు చెందిన టాటా న్యూ యాప్ ద్వారా మీరు సులభంగా రుణాన్ని పొందవచ్చు. ఈ యాప్ మీ ఫోనులో ఉండాలి. ఈ యాప్ ద్వారా టాటా క్యాపిటల్ నుండి లోన్ పొందవచ్చు. రూ. 10 వేల నుండి రూ. 10 లక్షల వరకు లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే టాటా న్యూ ఈ రుణాలను ఇవ్వడం లేదు. టాటా క్యాపిటల్ భాగస్వామ్యంతో ఈ అవకాశాన్ని అందిస్తుంది. మీ అర్హత, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఎంత లోన్‌కు అప్లికబుల్ అవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ కూడా చాలా ముఖ్యం.
నెలకు మీ జీతం 15 వేలా.. అటువంటి వారు కూడా ఈ రుణం పొందొచ్చు. కనీసం క్రెడిట్ స్కోర్ 750కు పైన ఉండాలి. ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవాలంటే ముందుగా టాటా న్యూ యాప్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ పైన లోన్ అండ్ కార్డు ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే.. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై టచ్ చేయాలి. తర్వాత మీరు మీ ఆఫర్ చెక్ చేసుకోవాలి. దీని కోసం మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, పేరు, ఈమెయిల్ వంటి వివరాలు నమోదు చేయాలి. మీ జాబ్ వివరాలు కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. కంపెనీ పేరు ఎంటర్ చేయాలి. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మీరు రుణానికి అర్హులైతే.. సులభంగా లోన్ వస్తుంది.
19 నుంచి 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు నెలకు కనీసం రూ. 15 వేలు జీతం వస్తుండాలి. మీరు తీసుకునే రుణాన్ని బట్టి టెన్యూర్ 60 నెలలు అంటే ఐదు సంవత్సరాలు పెట్టుకోవచ్చు. లేట్ పేమెంట్ చార్జీలు 3 శాతం వరకు పడతాయి. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్లాట్ 1500 ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. అలాగే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌తో కూడా టాటా న్యూ భాగస్వామ్యం చేసుకుంది. అవసరమైన వివరాలను అందించి, కావాల్సిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే చాలు. మీకు లోన్ వస్తుంది. (గమనిక: ఒకసారి యాప్ లో వివరాలు తనిఖీ చేసుకుని, ప్రొసిడ్ అవ్వాల్సిందిగా మనవి)