ఇంటర్నేషనల్ డెస్క్- జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమంటే అంత ఆశామాషి కాదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతున్న ఒలింపిక్స్ లో ఓ మహిళ కండోమ్ సాయంతో గోల్డ్ మెడల్ ను సాధించింది. అదేంటి కండోమ్ తో గోల్ట్ మెడల్ సాధించడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే అసలు కధ ఏంటంటే..
సాధారనంగా అథ్లెటిక్స్‌కి క్రీడా గ్రామంలో ఫ్రీగా కండోమ్స్ ఇస్తుంటారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ సురక్షిత శృంగారం కోసం అథ్లెట్స్‌కి కండోమ్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియాకి చెందిన జెస్సికా కావో ఈవెంట్ లో పాల్గొంది. ఈ క్రమంలో కానో ఈవెంట్ ఫైనల్ ముంగిట జెస్సికా పడవకి రిపేర్ వచ్చింది. ఆ కపడవ చివర్లో రంద్రం ఏర్పడింది. దాన్ని కార్బన్ మిశ్రమంతో పూడ్చిన జెస్సికా, అది మళ్లీ ఊడిపోకుండా ఉండేందుకు స్మూత్ ఫినిషింగ్ కోసం కండోమ్‌ని ఉపయోగించింది.
ఆ తర్వాత జరిగిన కానో పోటీలో అదే పడవతో జెస్సికా గోల్డ్ మెడల్ సాధించింది. ఆస్ట్రేలియాకి సీ1 కానో సాల్లోమ్‌లో గోల్డ్ మెడల్ అందించిన జెస్సికా, ఆ తర్వాత కానో సాల్లోమ్ కె1 ఫైనల్లోనూ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో జెస్సికాకి ఇదే ఫస్ట్ బంగారు పతకం.
కండోమ్‌ని ఇలా కయాక్ రిపేర్ కోసం కూడా వినియోగించవచ్చిన ఎవరికీ తెలియదు.. అని జెస్సికా సరదాగా వ్యాఖ్యానించింది. కండోమ్‌ని కయాక్ రిపేర్‌కి జెస్సికా వాడిన తీరుకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఆ వీడియోను మీరు కూడా చూసెయ్యండి.