కేరళ క్రైం- దేశంలో క్రైంరేట్ బాగా పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఈ దారణాలు మాత్రం ఆగడం లేదు. కేరళ రాష్ట్రంలో కలకలం రేకెత్తిస్తున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ యువతిని, మరో యువకుడు పట్టపగలే కాల్చిచంపడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేరళలోని కొత్తమంగళంలో మానస అనే 24 ఏళ్ల ఆ యువతి మెడికల్ కాలేజీలో చదువుతోంది. దాదాపు అంతే వయసున్నఓ యువకుడు ఆమె ఉంటున్న రూమ్‌కు సమీపంలోని ఓ హోటల్ లో గదిని అద్దెకు తీసుకుని, ఆమెను నిఘా పెట్టాడు. శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆ యువతి రూమ్‌కు వెళ్లి గన్ తో ఆమెను కాల్చి హత్య చేశాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్ఠానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ యువకుడి పేరు రఖిల్ రఘుథామన్‌గా పోలీసులు తేల్చారు. రఖిల్ ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. మానస,, రఖిల్ గతంలో ప్రేమించుకున్నారు. అనివార్య కారణాలవల్ల రెండు నెలల క్రితం రఖిల్‌కు మానస దూరంగా ఉంటూవస్తోంది. ఇకపై తనను కలవద్దని చెప్పంది. కానీ రఖిల్ మాత్రం ఆమెను వదిలిపెట్టడం లేదు. మానస వెంటపడి వెంబడిస్తుండడంతో ఆమె తండ్రి పోలీసులకు పిర్యాదు చేశాడు.
పోలీసుల రఖిల్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో మానసపై రఖిల్ కక్ష్యగట్టాడు. మానస మంగళంలో గాంధీ డెంటల్ అండ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో హౌస్ సర్జెన్సీ చేస్తోంది. ఆ కాలేజీకి దగ్గర్లోనే ఒక రూమ్ తీసుకుని తన స్నేహితులతో కలిసి ఉంటోంది. రఖిల్ అక్కడకు సమీపంలో ఉన్న ఓ హోటల్ లో గది తీసుకుని, నాలుగు రోజుల పాటు రహస్యంగా మానసపై నిఘా పెట్టాడు.
గత శుక్రవారం మధ్యాహ్నం మానస ఒక్కత్తే ఉందని నిర్ధారించుకున్న తరువాత ఆమె రూంకు వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న గన్ తో మానసపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత తనను తాను గన్ తో కాల్చుకున్నాడు. వీరిని హాస్పిటల్‌కు తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయారని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసికున్న పోలీసులు విచారణ చేపట్టారు.