కారు డ్రైవర్ తో డాక్టరమ్మ ప్రేమ, సహజీవనం-చివరకు

  • Written By:
  • Updated On - July 19, 2021 / 10:41 AM IST

ప్రకాశం రూరల్- ప్రేమ గుడ్డిది అని మన పెద్ద వాళ్లు చెప్పారు. అవును కొన్ని ప్రేమలను చూస్తోంటే నిజంగానే ప్రేమ గుడ్డిది అనిపించక మానదు. ఈ మధ్య కాలంలో ప్రేమలో పడుతున్న వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కుల, మతాలను పక్కన పెడితే వయసును చూసుకోకుండా ప్రేమించేసుకుంటున్నారు కొందరు. ప్రకాశం జిల్లాలో వెలుగులేకి వచ్చిన ప్రేమ వ్యవహారం ఔరా అనిపిస్తోంది.

ఓ కారు డ్రైవర్ ఏకంగా డాక్టర్ ను ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. రెండేళ్లు సహజీవనం కూడా చేశారు. చివరికి ఆ డాక్టర్ ను ఆ డ్రైవర్ మోసం చేశాడు. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని చిన్నకంభం గ్రామానికి చెందిన కాగిపోగు ప్రభాకర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ మెడికల్ కాలేజీ డాక్టర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో డెంటల్‌ అసిస్టెంట్‌ డాక్టర్ గా పని చేస్తున్న పట్టణానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

అంతా వీళ్లిద్దరు మొగుడు పెళ్లాం అనే అనుకున్నారు. రెండేళ్ల నుంచి కలిసున్నాం కదా ఇక తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడిగింది. ఇప్పుడు కాదు అప్పుడు అంతూ ఎప్పటికప్పుడు ఆ కారు డ్రైవర్ దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాకర్‌ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్న విషయం ఆ డాక్టర్ కు తెలిసింది. ఇదే విషయంపై అతన్ని నిలదీసింది. ఇంకేముంది అతడు ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున పారిపోయాడు.

చేసేది లేక ఆ యువ వైద్యురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు ఆశ్రయించింది. డాక్టర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మార్కాపురం బస్టాండ్‌లో ఉండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రైవర్ ను ఎలా ప్రేమించావని అంతా ఆ డాక్టర్ ను అడుగుతుండటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక బిక్కమొహం వేస్తోందట డాక్టర్.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV