విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి ఉత్సవాలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అప్పటి నుండి రజనీకాంత్ పై విమర్శలు మొదలయ్యాయి. దీనిపై..
తెలుగు సినిమాకు, తెలుగు ప్రజలకు ఖ్యాతి తెచ్చిన నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్). అంతటి మహోన్నత వ్యక్తి శత జయంతి ఉత్సవాలను విజయవాడ శివారు ప్రాంతంలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రజనీకాంత్ పలు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్టను పొగడ్తలతో ముంచెత్తారు. అదీ మొదలు.. రజనీకాంత్ పై అధికార పార్టీ వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. ఎన్టీఆర్‌తో, తెలుగుదేశం పార్టీతో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయనకు మంచి విజన్ ఉందని కొనియాడారు. అయితే అధికార పార్టీపై ఎటువంటి విమర్శలు చేయలేదు. అయినప్పటికీ అధికారిక వైసీపీ నేతలు ఆయనను తీవ్రంగా దూషిస్తున్నారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయడు. ‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని..అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి’అని ట్వీట్ చేశారు
‘వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు..ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి..జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.