అమరావతి- టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించారు. విరాట్ కోహ్లీ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ, తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశారు.
2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నియమితులయ్యారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టెస్టులకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ అకస్మాత్తుగా ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు.
విరాట్ కోహ్లీ నిర్ణయంపై దేశ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని ఎమోషనల్ అయ్యారు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి వార్తను కచ్చితంగా ఇప్పుడు తాము వినాలనుకోలేదని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు.
ఐతే విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని ఎమ్మెల్యే విడదల రజిని చెప్పారు. భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అందించిన సేవలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా బాగా రాణించాలని, సెంచరీల మీద సెంచరీలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే విడదల రజిని ట్వీట్ చేశారు.
We would not have wanted to hear this news & certainly not now but we respect your decision and thank you for all that you have given to Indian Cricket. We wish you all the best and hope to see much more cricket from you in days to come.#ViratKohli pic.twitter.com/JLO8DJRop8
— Rajini Vidadala (@VidadalaRajini) January 15, 2022