గుంటూరు- సాధారణంగా రాజకీయ పార్టీలు తమ పార్టీ గుర్తును నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటాయి. ఇక తమ పార్టీ జెండా రంగు అందరికి గుర్తుండిపోయేలా కార్యక్రమాలు చేస్తుంటాయి పొలిటికల్ పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెెస్ పార్టీ జెండా రంగుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందిరకి తెలిసిందే.
ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి పార్టీ జెండా రంగులను ప్రజల మదిలో శాస్వతంగా నిలిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని పంచాయితీ కార్యాలయాల నుంచి మొదలు, చాలా వరకు ప్రభుత్వ ఆఫీస్ లకు వైసీపీ జెండా రంగులను వేయించారు. ఐతే ఆ తరువాత కోర్టు జోక్యంతో పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించారు.
ఇదిగో ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రంగుల అంశం వివాదాస్పదమవుతోంది. తాజాగా విద్యార్థుల ముఖాలకు వైసీపీ పార్టీ రంగులు పూసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్సీ హైస్కూల్ లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ముఖాలకు వైసీపీ రంగులు వేశారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే కిలారి రోశయ్య, ఇతర వైసీపీ నేతలు హాజరయ్యారు.
దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదువుకునే పిల్లలకు ఒక పార్టీకి చెందిన రంగులు వేయడం దారుణమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. విద్యార్థుల ముఖాలకు ఒక రాజకీయ పార్టీ రంగులు పూయటమేంటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హోం మంత్రి, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దివ్యంగుల కార్యక్రమానికి వెళ్లి పిల్లల మొహాలు కి వైసీపీ రంగులు వేయటం ఏంటి సిగ్గు ఉందా అసలు జన్మకి https://t.co/Rbo7PUGGmZ pic.twitter.com/sVIPMkZdz9
— Vara Prasad JSP (@pv_pv86395189) December 4, 2021
విద్యార్థిల మొఖాలపై వైసిపి రంగులు….
హోంమంత్రి సమక్షంలోనే విద్యార్థులు ముఖానికి వైసీపీ పార్టీ రంగులు వేశారు…
ఎంత దిగజారి పోయాయో అర్థం అవుతుంది తూ ఈ వైసిపి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు…. pic.twitter.com/dgExn2kFdX
— ABD17🦁 (@jspharsha_) December 4, 2021