మానవ జీవితంలో పెళ్లి ఓ అద్భుతమైన వేడుక. పెళ్లీడు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సరితూగే భాగస్వామి వెతికే పనిలో ఉంటారు. అయితే ఇటీవల దేశంలో ఆడపిల్లల విషయంలో కరువు ఏర్పడింది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది.
అన్ని అవయవాలు సరిగా ఉంటేనే పిల్ల దొరకడం కష్టంగా మారింది కుర్రాళ్లకు. లక్షలు సంపాదిస్తున్నా పిల్ల దొరక్క ఒంటరిగా మిగిలిపోతున్నారు పెళ్లికాని ప్రసాదులు. దేశంలో వీరి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. బ్యాచ్‌లర్ లైఫ్‌కి బై బై చెప్పాదనమనుకున్నా..పెళ్లి కూతుర్లు దొరక్క అగచాట్లు పడుతున్నారు. కులం, మతం పట్టింపే కాదూ.. ఆఖరికి ఎదురు కట్నమిచ్చి చేసుకుంటామన్నావధువులు దొరకని పరిస్థితి. మరీ వీరి పరిస్థితే ఇలా ఉంటే అంగ వైకల్యంతో బాధపడేవారు, మరగుజ్జు మనుషుల సంగతేమిటీ. వీరికి ప్రతి విషయంలోనూ హేళనే ఎదురౌతుంది. అయితే అవమానాలను ఎదుర్కొన్న ఓ మరగుజ్జు వ్యక్తి.. ఖ్యాతి గడించడమే కాదూ.. వివాహం కూడా చేసుకున్నాడు.
ప్రతీక్ విఠల్ మెహిత్ ఎత్తు 3 అడగుల 4 అంగుళాలు. పొట్టోడే కానీ గట్టోడండీ.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీ బిల్టర్ ఇతగాడు. 2021లో ప్రపంచంలో అత్యంత పొట్టి బాడీ బిల్లర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో్సారి వార్తల్లో నిలిచాడు. అతడు ఓ ఇంటి వాడయ్యాడు. జయ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎత్తు 4 ఫీట్ల 2 అంగుళాలు మాత్రమే. ఇందులో విశేషమేమిటంటే వీరిద్దరిదీ ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన బాడీ బిల్లర్ ప్రతీక్‌కు నాలుగేళ్ల క్రితం జయతో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా ఏర్పడి.. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయాన్ని ప్రతీక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఓ వాహనంపై నిలుచుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా పోస్టు చేశాడు. తన భార్యతో కలిసిన దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు. హల్దీ వేడుకకు సంబంధించిన వీడియోతో పాటు మరికొన్నింటిని షేర్ చేశాడు. ప్రతీక్ 2012లో తన బాడీబిల్డింగ్ వైపు వచ్చాడు. మొదట్లో అతని పరిమాణం కారణంగా వ్యాయామాలు చేయడం, పరికరాలను పట్టుకోవడంలో చాలా కష్టపడ్డాడు. పట్టు వదలకుండా జిమ్‌లో కష్టపడ్డాడు. ప్రతీక్ మొదటిసారిగా 2016లో బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నాడు. అతనికి కుటుంబ సభ్యులు, స్నేహితులు సపోర్ట్ చేయడంతో 2021లో అతడు అనుకున్నదీ సాధించాడు. 2021లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి పోటీ బాడీబిల్డర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతడి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.