నిత్యం మనం మార్నింగ్ టీ తాగుతాం. టీ లేనిదే ఏ పనీ జరగదు. అందరు ప్రతినిత్యం తీసుకునే పానీయం టీ. దీని యొక్క ఏటీఎమ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. దీనిని హెటెక్ సిటీలోని అవాసా హోటల్లో ప్రారంభించారు.
మనం రోజు పొద్దున్నే నిద్ర లేవగానే బ్రష్ చేసి ‘టీ’తాగుతాం. ఇది అందరికి అలవాటు. ప్రతిరోజు ప్రతి ఇంట్లో వంటకంటె ముందు ‘టీ’ పెట్టి తాగాల్సిందే. లేదంటే ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందరికి ప్రతిరోజు మొదలయ్యేది ‘టీ’ తోనే. అయితే ఈ ‘టీ’ లలో రకరకాల‘టీ’లు ఉంటాయి. అల్లం టీ, వాము టీ, ఇలాచీ టీ, లెమన్ టీ అని వెరైటీ టీలు ఉంటాయి. ఎంతటి నిరుపేదవారైనా సరే ‘టీ’కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తారు. మనకు వర్క్ ఎక్కువైనపుడు కూడా రిలాక్స్ కోసం ‘టీ’ తాగుతాం. ఇలాంటి ‘టీ’ మనం ఇంట్లో డికాషన్‌తో పాలు కలిపి ‘టీ’తయారు చేస్తాం. కొన్ని మిషన్స్‌లో కూడా కాఫీ, టీ, మిల్క్ ఉంటాయి. బటన్ నొక్కగానే మనకు కావలసిన డ్రింక్స్ వస్తాయి. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘టీ’ ఏటీఎమ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం..
ప్రపంచంలోనే తొలి టీ, కాఫీ, వాటర్ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. గురువారం హైదరాబాద్ నగరంలో ఈ మెషిన్‌ను స్టార్ట్ చేశారు. జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ మెషిన్‌కు రూపకల్పన చేశారు. పి. వినోద్‌కుమార్ అనే వ్యక్తి ఈ మెషిన్‌ను రూపొందించాడు. మనకు కావలసిన ఐటమ్స్‌ను QR కోడ్ ద్వారా ఎంచుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ లాంటి డెవలపింగ్ కంట్రీలో వెండింగ్ మెషిన్స్ లేవు, దేశం మొత్తం 100 మాల్స్‌లో కేవలం ఒక వెండింగ్ మెషిన్ మాత్రమే ఉందని.. బ్యాంకు లోన్‌తోపాటుగా బీమా సౌకర్యంతో ఈ మెషిన్స్ అందుబాటులోకి తీసుకున్నారని.. రిఫ్రిజిరేటర్ కంటె కూడా తక్కువ రేటులో దొరుకుతుందిని చెప్పారు. ఈ మెషిన్స్ ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. దీనిని హైటెక్ సిటీలోని అవాసా హోటల్లో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఎంపీ రంజిత్ రెడ్డి, సినీ నటుడు మంచు మనోజ్, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖులు వినోద్ కుమార్ ఆవిష్కరణను అభినందించారు.