అడవులు ఉండే ప్రాంతాల్లో రోడ్ల మీద వెళ్తున్నప్పుడు జంతువులు రావడం అనేది సహజం. ఎక్కువగా ఏనుగులు రోడ్ల మీదకు వస్తుంటాయి. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కారుని ఒక ఏనుగు చూసింది. కారు దగ్గరకు వెళ్ళింది. దాడి చేస్తుందేమో అన్న భయం ఒకవైపు. కానీ కారులో ఉన్నవాళ్లు చేసిన పనికి ఆ ఏనుగు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కారులో ఉన్న వారు ఏం చేశారంటే?
అరణ్య ప్రాంతాల గూండా ప్రయాణం చేసినప్పుడు జంతువులు రోడ్ల మీదకు వస్తుంటాయి. కొన్ని జంతువులు అయితే అటుగా వచ్చే వాహనాల మీద దాడులు కూడా చేస్తాయి. ఏనుగులు ఎక్కువగా రోడ్ల మీదకు వచ్చి బీభత్సం చేసిన సంఘటనలు గతంలో చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన మాత్రం అందుకు భిన్నం. కారులో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక ఏనుగు ప్రత్యక్షమైంది. కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని నిలిపివేశారు. ఆ ఏనుగు కారు వైపే వస్తుండడంతో కారులో ఉన్న స్త్రీలు భయపడ్డారు. అయితే ఏనుగు దగ్గరకు రావడంతో కారులో ఉన్న వారు చేసిన పనికి ఏనుగు ఏమీ చేయకుండా వదిలేసింది. అంతేకాదు.. కారులో ఉన్న వారిని ఆశీర్వదించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకే కారులో ఉన్నవారు ఏం చేశారో తెలుసా? జస్ట్ గణేష్ మంత్రాన్ని జపించారు. కారులో బ్రాహ్మణులు ఉన్నారు. ఏనుగు తమ దగ్గరకు రావడంతో కారులో ఉన్న ఒక మహిళ.. ‘కృష్ణ వాసుదేవా’ అంటూ మంత్రాన్ని ప్రారంభించారు. ఏనుగు వేగంగా కదలడం గమనించిన బ్రాహ్మణులు.. గణేష్ మంత్రాన్ని బిగ్గరగా చదువుతూ ఏనుగును శాంతింప జేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కారును మెల్లగా వెనక్కి పోనిస్తూ వెళ్లారు. ఓం శాంతి శాంతిః అని ఆఖరున మంత్రం చదవడంతో ఏనుగు వారికి దారి వదిలింది. వెళ్లే ముందు ఏనుగు తన తొండాన్ని పైకెత్తి అందరినీ ఆశీర్వదించింది. ఏనుగు తమకు దారి వదలడంతో కారులో ఉన్న వారు సంతోషించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నయం కాని వ్యాధులు మంత్రం ద్వారా నయమవుతాయని నమ్ముతారు. మంత్రం జపించడం వల్ల మనకు తెలియకుండానే శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. తెలియని ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అలానే ఎక్కువ మంది కలిసి మంత్రాలు చదివితే దాని ఫలితం వేరేలా ఉంటుంది. పూర్వం వర్షాలు పడడం కోసం యాగాలు నిర్వహించేవారు. ఆ సమయంలో మంత్రాలు చదివేవారు. ఆ మంత్ర ప్రభావంతో వర్షాలు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. మంత్రానికి అంత గొప్ప శక్తి ఉంది కాబట్టే ఏనుగు మంత్రం వినగానే దాడి చేయకుండా ఉంది. మామూలుగా ఏనుగులు రోడ్డు మీదకు వస్తే దాడి చేయకుండా ఉండవు. కానీ ఈ బ్రాహ్మణులు మంత్రం చదివి ఏనుగును శాంతింపజేశారని.. మంత్రానికి ఉన్న శక్తి అదే అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
🌺Power of manthram….🌺
When a car full of Brahmins meet a wild elephant…. just they start chanting shlokas. See what happens.
Atheists will laugh. A simple proverb is there. pic.twitter.com/s5clCwDJHc
— Vasavi Narayanan (@VasaviNarayanan) March 25, 2023