ప్రస్తుతం స్త్రీలు అని రంగాల్లో పురుషులకి ఏ మాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. అయితే ఎన్ని రంగాల్లో రాణించినా ఫిజికల్ గా వారు మగవారితో పోటీ పడలేరు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మగవారితో ఫైట్ చేయడమే కష్టమనుకుంటున్న రోజుల్లో ఒక స్త్రీ ఏకంగా రెండు క్రూర మృగాలను ఎదిరించింది.
సమాజంలో మగవారితో పోలిస్తే ఆడవారు బలహీనులుగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్త్రీలు అని రంగాల్లో పురుషులకి ఏ మాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. అయితే ఎన్ని రంగాల్లో రాణించినా ఫిజికల్ గా వారు మగవారితో పోటీ పడలేరు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మగవారితో ఫైట్ చేయడమే కష్టమనుకుంటున్న రోజుల్లో ఒక స్త్రీ ఏకంగా రెండు క్రూర మృగాలను ఎదిరించింది. వారి కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆమె సివంగిలా మారి పోరాటం చేసింది. భర్త ప్రాణాల కోసం ఆమె ఏకంగా యముడిని ఎదురించినట్టు.. తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. కర్ణాటక జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా బసవకట్ట గ్రామానికి చెందిన బసీర్ సాబ్ సవదత్తి(45), అతడి బావమరిది ముందగోండకు చెందిన రజాక్ నల్బంద్ (30) నివసిస్తున్నారు. అయితే వాళ్లు ప్రతిరోజు వ్యవసాయ చేయడానికి వెళ్లేవారు. అలాగే శనివారం రోజున ఉదయం రోజు లాగానే పొలానికి వెళ్లారు. ఆ ఇద్దరూ పనిలో నిమగ్నమై ఉండగా వారిపై అకస్మాత్తుగా ఓక్కసారిగా మూడు ఎలుగుబంట్లు దాడి చేసాయి.. ఎలుగుబంట్లు దాడి చేస్తున్న విషయం గమనించిన బసీర్ సాబ్ భార్య సబీనా(35) ఒక్కసారి షాక్ కు గురి అయ్యి వెంటనే తేలుకొని.. నా భర్త ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకొని సబీనా శివంగిలా పరుగెత్తుకుంటూ అక్కడ ఉన్న ఎలుగుబంట్ల పోరాటానికి దిగింది. ఆ ఎలుగుబంట్ల వాటిలో ఉన్న ఒకదానిపై గొడ్డలితో దాడి చేయగానే.. భాదితులను వదిలేసింది. దీంతో ఎలుగుబంట్లు వెనక్కి జరిగాయి. ఆ దాడి నుంచి బయటపడిన బసీర్ సాబ్, రజాక్ లు రాళ్లు విసిరడంతో పలాయనం చిత్తగించాయి. ఆ గొడ్డలి దెబ్బకు తీవ్రంగా గాయపడిన ఎలుగుబంటి పరుగు లంఘించుకోవడంతో మిగతా రెండు దానిని అనుసరించి.. ఎలుగుబంట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన బసీర్ రజాక్ లను చికిత్స కోసం హుబ్బళ్లిలోని కర్ణాటక ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ప్రస్తుతం వాళ్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సబీనా మాట్లాడుతూ.. నా భర్త సోదరుడిపై ఎలుగుబంట్ల దాడిచేయడం నేను చూసాను.. అందుకని వాళ్లు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకొని ఏం ఆలోచన చేయకుండా పక్కనే ఉన్నా గొడ్డలిని తీసుకొని అక్కడికి వెళ్లాను. వాటిలో ఒకదానిపై బలంగా గొడ్డలితో దాడి చేసాను. అలా చేయడం వల్లనే భయపడి వాళ్లని వదిలిపెట్టాయి. ఇంతలోనే మిగతా రెండింటిపై నా భర్త, సోదరుడు రాళ్లు విసరడంతో అవి పరుగెత్తాయి. ఇంకొక ఎలుగుబంటిని గొడ్డలితో నరకడం వల్ల అది తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పారిపోయింది. దానిని అనుసరించి మిగతా రెండు వెళ్లిపోయాయి. అయితే నేను ఎలా స్పందించానో నాకు తెలియదు. కానీ నా భర్త, సోదరుడు ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డారు. అని ఘటన గురించి వివరంగా చెప్పారు.