ఉత్తర్ ప్రదేశ్ క్రైం- ఈ కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మవద్దో తెలియడం లేదు. ప్రధానంగా అమ్మాయిల విషయంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఆడపిల్ల బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి వస్తుందో, రాదో అన్న ఆందోళన పెరిగిపోయింది. దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
తన కూతురి వయసున్న బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లిన మహిళ, తనే దగ్గరుండి భర్త చేత ఆ చిన్నారిపై అత్యాచారం చేయించింది. కౌశాంబి జిల్లా పశ్చిమ సరీరా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. స్థానికంగా ఉండే 16 ఏళ్ల దళిత బాలికతో ఓ మహిళ పరిచయం పెంచుకుంది.
ఆ తరువాత అదును చూసి ఆ పాపకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లింది. తానే స్వయంగా తన భర్త చేత ఆ బాలికపై అత్యాచారం చేయించింది. భార్య కళ్ల ముందే ఆ నీచుడు ఆ 16ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఇంట్లోవాళ్లందరిని చంపేస్తామని ఆ భార్యా భర్తలు పాపను భయపెట్టారు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన అమానుషాన్ని ముందు ఎవ్వరికి చెప్పలేదు.
కానీ బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి నిలదీయడంతో అప్పుడు జరిగి విషయమంతా చెప్పింది. వెంటనే బాలిక తల్లి, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఐతే పోలీసులు ఆ కేసు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో బాధితురాలి తల్లి కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ దుర్మార్గున్ని కఠినంగా శక్షించాలని మహిళా సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.