తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే.. తల్లిదండ్రుల తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువులకు అంత గౌరవం ఉందన్న మాట. కానీ, కొంతమంది గురువులు తమ విద్యార్థులను బిడ్డల్లా కాకుండా.. తప్పుడు దృష్టితో చూస్తున్నారు. వారితో తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారు. తాజాగా, ఓ మహిళా టీచర్ తాను పాఠాలు చెప్పే ఓ స్టూడెంట్‌పై కన్నువేసింది. మంచి మార్కుల ఆశ చూపి, అతడితో తన కామవాంఛను తీర్చుకుంది. చివరకు విషయం బయట తెలిసి జైలు పాలైంది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అమెరికాలోని మిస్సోరికి చెందిన 26 ఏళ్ల లీనా స్టీవర్ట్ అనే యువతి అక్కడి ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. లీనా కన్ను తన క్లాసులోని ఓ బాలుడిపై పడింది. అతడితో ఎలాగైనా తన కోర్కెలు తీర్చుకోవాలనుకుంది. ఇందుకోసం ఓ ప్లాన్ వేసింది. ఓ రోజు అతడ్ని తన దగ్గరకు పిలుచుకుంది. తన కోర్కెలు తీరిస్తే.. క్లాస్‌లో బాగా చూసుకుంటానని, మార్కులు కూడా బాగా వేస్తానని చెప్పింది. ఇందుకు ఆ బాలుడు సరేనన్నాడు. ఓ రోజు లీనా ఆ బాలుడ్ని తన స్నేహితుల ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ అతడితో తన కోర్కెలు తీర్చుకుంది. టీచర్ స్పీడుకు అతడు ఇబ్బంది పడ్డాడు. తనను అక్కడినుంచి పంపాలని కోరాడు. దీంతో ఆమె అతడ్ని ఇంటికి పంపేసింది.
ఇక, క్లాసులో కూడా ఆమె అతడ్ని పట్టించుకునేది కాదు. హోంవర్క్ ఇచ్చేది కాదు. ప్రశ్నలు వేసేది కాదు. పరీక్షల్లో కూడా ఆ బాలుడికి మంచి మార్కులు వేసేది. ఈ నేపథ్యంలోనే రెండో సారి ఆమె అతడ్ని తన ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ అతడితో తన కోర్కెలు తీర్చుకుంది. అయితే, ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ, విషయం కాస్తా బయటకు పొక్కింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లీనాను అరెస్ట్ చేశారు. స్కూలు కూడా ఆమెను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నడుస్తోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.