హైదరాబాద్– ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం కనిపించడం లేదు. పక్క వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా ఎవ్వరు గమనించడం లేదు. తమ పనేదో తాము చూసుకుంటున్నారు తప్ప, మిగతా వారిని ఏ మాత్రం గమనించడం లేదు. అందులోను స్మార్ట్ పోన్లు వచ్చాక ఎవరంతకు వారు బిజీ అయిపోయారు.
ఇదిగో ఇక్కడ హైదరాబాద్ మోట్రో రైల్ లో జరిగిన ఈ ఘటన చూస్తే ఇది అక్షరాల నిజం అని అనిపించక మానదు. మోట్రో రైలు బోగీ నిండుగా జనం ఉన్నారు, ఒక్క సీటూ కూడా ఖాళీ లేదు, అంతలో ఓ స్టేషన్ లో చేతిలో పసికందుతో ఓ మహిళ ట్రైన్ ఎక్కింది. బోగీలో చూస్తే ఒక్క సీటు కూడా ఖాళీ లేదు.
చంటిపాపతో ఉన్న ఆ మహిళ కోసం ప్రయాణికులెవరూ సీటు ఇవ్వలేదు. అంతే కాదు ప్రయాణీకులంతా మొబైల్ ఫోన్లు చూసుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ కనీసం ఆ మహిళను, పసిపాపను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇంకేముంది చేసేది లేక సదరు మహిళ శిశువును ఒళ్లో పడుకోపెట్టుకుని బోగీలో క్రింద కూర్చుని ప్రయాణించింది.
ఈ దృశ్యాన్ని అదే బోగీలో ప్రయాణిస్కున్న వారెవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మోట్రో రైల్ లోని బోగీలో సీట్లలో కూర్చున్న వారంతా చదువుకున్నవారేనని కనిపిస్తోంది. పైగా యువతులు. చంటి బిడ్డతో ఉన్న మహిళకు కనీసం సీటు ఇచ్చే మానవత్వం లేదా అంటూ నెటిజన్లు మండిపుతున్నారు.