మ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తుంది. తొమ్మిది నెలలు మోసాక.. బిడ్డ తొలి చూపు కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ ఆమె ఆశలను అడియాశలు చేస్తోంది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం. వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి పురుడికి వెళుతున్న గర్భిణీల పాలిట శత్రువులుగా మారుతున్నారు వైద్యులు.
బిడ్డకు జన్మనివ్వడం వరమని మహిళ భావిస్తుంది. గర్భిణీ అయిన దగ్గర నుండి తన బాధ్యతతో పాటు తన కడుపులో ఉన్న బేబీ కోసం ఆహార నియమాల దగ్గర నుండి ప్రతి దానిపై శ్రద్ధ చూపిస్తుంది కాబోయే అమ్మ. అమ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తుంది. తొమ్మిది నెలలు మోసాక.. బిడ్డ తొలి చూపు కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ ఆమె ఆశలను అడియాశలు చేస్తోంది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం. వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి పురుడికి వెళుతున్న గర్భిణీల పాలిట శత్రువులుగా మారుతున్నారు వైద్యులు. మొన్నటికి మొన్న పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో బిడ్డ, కొన్ని గంటల తర్వాత తల్లి చనిపోయిన సంగతి విదితమే. తాజాగా మరో గర్భిణీ. కొడుకు ఏడుపు వినకుండానే కాటికి చేరింది.
వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని బాల్ రాం నగర్‌కు చెందిన రాజేశ్వరిని డెలీవరి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రి 10 గంటలకు ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమెకు సాధారణ కాన్పుకు యత్నించారు. అయితే ఆమె ఎక్కువగా నొప్పులు తీసుకోవడంతో.. చిన్న శస్త్ర చికిత్స చేయి బిడ్డను బయటకు తీశారు. అయితే పుట్టిన పాప బరువు తక్కువగా ఉండటంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పాపను కూడా సరిగా చూడలేదు. అయితే కాన్పు అయిన కొంత సేపటికి రాజేశ్వరికీ ఫిట్స్ రావడం మొదలయ్యాయి.
దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ప్రసూతి ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడికి తరలించే సమయానికి రాజేశ్వరి కన్నుమూసింది. అయితే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని కల్వకుర్తి ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు యత్నించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపించారు. ఈవిషయమై ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శివరాం స్పందిస్తూ.. మృతురాలి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని, మొదటి కాన్పు కావడంతో సాధారణ ప్రసవం చేశామని, ఆ తర్వాత ఫిట్స్ వచ్చాయని, అవి తగ్గకపోవడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించామన్నారు. అక్కడకు తీసుకెళ్లగా ఆమె మరణించిందన్నారు.