స్పెషల్ డెస్క్- ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి.. ఈ మాట ఎప్పుడు అంటారో తెలుసు కదా. అవును.. ఎవరైనా చావు దాకా వెళ్లి.. మళ్లీ బతికివస్తే.. వాళ్లకు ఇంకా ఈ భూమ్మీద నూకులు ఉన్నాయని కామెంట్ చేస్తుంటారు. అంతే కదా మరి.. ఇక పనైపోయింది.. బతకడం కష్టం అనుకున్న సమయంలో, కొంత మంది అనూహ్యంగా బతుకుతుంటారు.. వీళ్లనే చావు అంచులదాకా వెళ్లి వచ్చారని కూడా ఉంటుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా..
అచ్చు ఇలాగే ఓ మహిళ, మరో చంటి బిడ్డ చావు దగ్గరగా వెళ్లి వచ్చారు. అసలు వాళ్లు ఎలా బతికి బట్టకట్టారో చూస్తే వామ్మో అనిపిస్తుంది. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ట్రైన్ మెల్లిగా కదులుతోంది. ట్రైన్ లో అల్ రెడీ ఎక్కిన ఓ మహిళ, మరి ఏం మరిచిపోయిందో తెలియదు కానీ, చంటి బిడ్డతో పాటు వెళ్తున్న ట్రైన్ లోంచి దిగే ప్రయత్నం చేసింది. అంతే ఆమె ప్లాట్ ఫాంపై కాలు పెట్టగానే స్లిప్ అయి.. ట్రైన్ కు, ప్లాట్ ఫాంకు మధ్య పడిపోయింది.
కిందకు పడిపోయిన వెంటనే లేవడానికి ప్రయత్నించిందా మహిళ. అంతే కాదు చేతిలో ఉన్న బిడ్డను ప్లాట్ ఫాంపై ఉంచేందుకు ట్రై చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. బిడ్డతో పాటు ట్రైన్ కు, ప్లాట్ ఫాంకు మధ్య పడిపోయింది. అక్కడే ఉన్న ఓ రైల్వే పోలీస్ వాళ్లను కాపాడే ప్రయత్నం చేసినా అధి ఫలించలేదు. దీంతో ట్రైన్ ను ఆపాలని చూశారు. అంతలోనే ట్రైన్ ముందుకు వెళ్తే కానీ వాళ్లు ఎక్కడ ఉన్నది తెలియదని భావించిన వాళ్లు, ట్రైన్ ను ముందుకు వెళ్లమని చేతులతో సైగలు చేశారు.
ట్రైన్ మెల్లిగా ముందుకు వెళ్లాక పట్టాలపై చూసిన దృశ్యాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. ఆ మహిళ, చంటి బిడ్డ ట్రైన్ కింద నుజ్జునుజ్జై ఉంటారని అంతా భయపడ్డారు. కానీ అలాంటిదేమి జరగలేదు. మహిళతో పాటు బిడ్డ కూడా ప్లాట్ ఫాం గోడకు హత్తుకుని, ప్రాణాలను బిగపట్టుకుని ఉన్నారు. ట్రైన్ వెళ్లిపోగానే అక్కడున్నవాళ్లు బిడ్డతో పాటు మహిళను ప్లాట్ ఫాంపైకి లాగారు. వాళ్లకు చిన్న చిన్న గాయాలైనా.. ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తల్లీ, బిడ్డకు ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి కదా మరి.