ఒక ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేస్తే.. వచ్చే కిక్కే వేరు. అలాంటి అద్భుతమైన రికార్డును క్రికెట్‌లో చాలా కొంది మంది ఆటగాళ్లు మాత్రమే కలిగి ఉన్నారు. అందులో టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒకడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది సంచలనం నమోదు చేశాడు. ఇప్పటికీ.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులంటే.. గుర్తుకు వచ్చే ప్లేయర్ యువీనే. అలాంటి అద్భుత రికార్డును యువీ కలిగి ఉండటం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అదృష్టం కూడాను. అయితే.. యువీ 6 బంతులకు ఆరుసిక్సుల రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమే.
ఎందుకంటే ఒక ఓవర్‌లో ఆరు బంతులకంటే ఎక్కువ ఉండవ్.. సో ఆరు సిక్సుల కంటే ఎక్కువగా కొట్టే ఛాన్స్ లేదు. నో బాల్స్ లాంటివి వేయకుండా.. యువీ రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. అయితే.. యువీ రికార్డును ఈక్వల్ చేయవచ్చు. అయితే అతని రికార్డు బ్రేక్ కాకున్నా.. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అతని పేరు చిరకాలం నిలిచిపోతుంది. అయితే.. ప్రయత్నమే న్యూజిలాండ్ క్రికెటర్ చేశాడు. ఒకే ఓవర్‌లో ఐదు బంతులను వరుసగా సిక్సులుగా మలిచి.. చివరి బంతికి కూడా భారీ షాట్ ఆడాడు. కానీ.. అది కొద్దిలో మిస్ అయి.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ చేతుల్లో పడింది. దీంతో.. ఆరు బాల్స్‌కు ఆరు సిక్సులు కొట్టకుండానే అవుట్ అయ్యాడు. కానీ.. ఒకే ఓవర్‌లో 5 సిక్సులు బాది సంచలనం నమోదు చేశాడు.
ఈ ఘటన న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్ సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఆక్లాండ్ ఏసెస్-సెంట్రల్ స్టాగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విల్ యంగ్ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు బాదేశాడు. సెంట్రల్ స్టాగ్స్ తరఫున ఆడుతున్న యంగ్.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి దడదడలాడించాడు. ముఖ్యంగా లూయిస్ డెల్పోర్ట్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో అయితే యంగ్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఐదు బంతులను సిక్సులు బాదేశాడు. చివరి బాల్‌కి కూడా సిక్సు కోసం ప్రయత్నించిన యంగ్.. క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మొత్తం 27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులతో 67 పరుగులు చేసిన విల్ యంగ్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆక్లాండ్ ఏస్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 191 పరుగుల భారీ స్కోరే చేసింది. విల్ యంగ్ సృష్టించిన విధ్వంసంతో సెంట్రల్ స్టాగ్స్ ప్రస్తుతం 9.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 108 పరుగులతో ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సులతో విధ్వంస సృష్టించిన విల్ యంగ్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు 12 టెస్టులు, 8 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. మరి యంగ్ ఐదు సిక్సులు బాదడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Will Young smashed 6,6,6,6,6 in an over, but gets out while trying to hit his 6th six in the over. pic.twitter.com/MRB0EDOUjK
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2023