మానవ సంబంధాలు మంట కలసి పోతున్నాయి. డబ్బు కోసం, శారీరిక సుఖం కోసం కొంతమంది చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. సభ్య సమాజం తల దించుకునే ఇలాంటి ఓ ఘటన తాజాగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం ఏల్చూరులో కు చెందిన లక్ష్మయ్య సునీతకు 18ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా. వీరితో పాటు.. లక్ష్మయ్య తండ్రి కరుణయ్య కూడా వీరి వద్ద ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఉన్నాడు.
నిజానికి ఇంత వరకు వీరి జీవితం బాగానే ఉంటూ వచ్చింది. అయితే.., సునీత భర్త మద్యానికి బానిసై కుటుంబ పోషణ సైతం పట్టించుకోకుండా పోయాడు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. కొడుకు మద్యానికి బానిస అవ్వడంతో.. మామ కరుణయ్య ఇంటి ఖర్చులను నడుపుతూ వచ్చాడు. ఈ క్రమంలో మామ కరుణయ్యతో సునీత వివాహేతర సంబంధం పెట్టుకుంది. తప్పని చెప్పాల్సిన పెద్ద మనిషి కరుణయ్య కూడా శారీరిక సుఖం కోసం కక్కుర్తి పడి కూతురు లాంటి కోడలితో వివాహేతర సంభందం కొనసాగించాడు.
లక్ష్మయ్య నిత్యం మత్తులో ఉండటంతో ఈ మామకోడళ్ల ఆటలకి అడ్డే లేకుండా పోయింది. కానీ.., వీరిద్దరూ తమ బంధాన్ని శాశ్వితం చేసుకోవాలి అనుకున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న తన భర్తని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది భార్య సునీత. దీనికి కరుణయ్య కూడా సహకారం అందించాడు. అలా.. లక్ష్మయ్యని సొంత తండ్రి, కట్టుకున్న భార్య కలసి ఈనెల ఈనెల 1న అర్ధరాత్రి హత్య చేశారు. నిద్రిస్తున్న లక్ష్మయ్య మొహానికి దిండు అడ్డం పెట్టి, గాలి ఆడకుండా చేసి ఈ దారుణానికి ఒడికట్టారు.
లక్ష్మయ్య తాగి వచ్చి, నిద్రలోనే చనిపోయాడని అందరినీ నమ్మించారు ఈ మామకోడళ్లు. కానీ.., ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తాత, తల్లి కలిసి తన తండ్రిని చంపుతుండగా లక్ష్మయ్య పెద్దకుమారుడు తన కళ్లారా చూశాడు. దీంతో విషయం బయటకు వచ్చింది.రంగంలోకి దిగిన పోలీసులు కరుణయ్య, సునీతను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. కన్న తండ్రి, సొంత భార్య కలసి ఇంతటి దారుణం చేయడంతో ఈ కేసు సంచలనం అయ్యింది. మరి.., వావి వరుసలు లేకుండా, మానవ బంధాలను మంట కలుపుతున్న ఇలాంటి వారికి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.